NTV Telugu Site icon

Chandika: “చండిక”ది కథ కాదు వ్యధ.. ఇలాంటి ఆత్మను ఇంకెక్కడా చూసి ఉండరు!

Chandika Movie

Chandika Movie

Chandika Movie Trailers Released: ప్రతి ఆత్మకు ఒక కథ ఉంటుంది, అలాగే చండికకి కూడా ఓ కథ ఉంది కానీ తన కధ మాత్రం ఎప్పుడు ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కథ. దాన్ని కథ అని చెప్పడం కంటే తన వ్యధ అని చెప్పవచ్చని అంటున్నారు చండిక మూవీ మేకర్స్. అయితే చండిక కధ ఏంటి? ఆమె తాపత్రయం ఏంటి? ఎందుకు మనల్ని భయపెట్టాలని అనుకుంటుంది అనే అంశాన్ని “చండిక” సినిమాలో చూపించబోతున్నామని దర్శకుడు తోట కృష్ణ వెల్లడించారు. వీర్, శ్రీహర్ష, నిషా, ఖుషి ప్రధాన పాత్రలల కోటిపల్లి ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.పాపారావు నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ సినిమా నాలుగు ట్రైలర్లను ఆవిష్కరించారు.

Bandi Sanjay : కరీంనగర్‌లో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్

అతిధులుగా పాల్గొన్న తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్..దామోదర్ ప్రసాద్, మాజీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కె.బసిరెడ్డి, నిర్మాతలు సాయివెంకట్, మోహన్ గౌడ్, గురురాజ్ ఒక్కొక్కరు ఒక్కో ట్రైలర్ ను విడుదల చేయడం గమనార్హం. ఈ క్రమంలో దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ, “హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది, ఇందులో ఆత్మ ప్రతీకారం తీర్చుకునే అంశం చాలా కొత్తగా ఉంటుందని, పాత్రధారులంతా తమపాత్రలకు న్యాయం చేకూర్చారని అన్నారు. పలు చిత్రాలు తీసిన నిర్మాత గురురాజ్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించారని అన్నారు. నిర్మాత కె.వి.పాపారావు మాట్లాడుతూ ” ఈ చిత్రానికి నేనే కథను అందించా, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి, ఇదే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.