Site icon NTV Telugu

Meter: ఈరోజు సాయంత్రం బయటకి రానున్న ‘చమ్మక్ పోరీ’…

Meter

Meter

వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఫిబ్రవరి నెలలో మంచి హిట్ కొట్టాడు యంగ్ హీరో ‘కిరణ్ అబ్బవరం’. ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటకి వచ్చిన ఈ సీమ కుర్రాడు, రెండు నెలలు కూడా తిరగకుండానే ‘మీటర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. రమేష్ కాడురి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ఇటివలే టీజర్ ని లాంచ్ చేశారు. కిరణ్ అబ్బవరం పోలిస్ పాత్రలో నటిస్తున్న ‘మీటర్’ టీజర్ మాస్ మీటర్ లో ఉంది. బీ, సి సెంటర్స్ లో కిరణ్ అబ్బవరం రిపీట్ ఆడియన్స్ ని రాబట్టడం అయితే గ్యారెంటీ అనే విషయం టీజర్ తోనే అర్ధమవుతుంది. మీటర్ సినిమా ప్రమోషన్స్ లో మరింత కిక్ ఇవ్వడానికి, ఈ మూవీ ఆల్బమ్ నుంచి ‘చమ్మక్ చమ్మక్ పోరీ’ సాంగ్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకి చమ్మక్ చమ్మక్ పోరీ సాంగ్ రిలీజ్ కానుంది. మరి మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, కిరణ్ అబ్బవరం కోసం ఎలాంటి మాస్ మీటర్ లో ఉండే సాంగ్ ఇచ్చాడో చూడాలి. అత్యుల రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానుంది. మరి కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ సెకండ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Exit mobile version