Chakravyuham: చిత్ర నిర్మాణంలోనే కాదు కొద్ది కాలంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పంపిణీరంగంలోనూ జోరు పెంచింది. తాజాగా ఈ సంస్థ అజయ్ ప్రధాన పాత్ర పోషించిన ‘చక్రవ్యూహం’ మూవీకి సంబంధించిన సీడెడ్, నైజాం పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘చక్రవ్యూహం’ కు ‘ది ట్రాప్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను చెట్కూరి మధుసూదన్ దర్శకత్వంలో సావిత్రి నిర్మించారు. జూన్ 2న విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన రెండు ప్రధానమైన ఏరియాల పంపిణీని మైత్రీ మూవీ మేకర్స్ శశిధర్ రెడ్డి దక్కించుకోవడంతో ప్రాజెక్ట్ పై సహజంగానే క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్ సైతం ఇంప్రసివ్ గా ఉండటంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అజయ్ నటన ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని దర్శకుడు మధుసూదన్ చెబుతున్నారు. ఇందులో జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశీ పరదేశి, ప్రజ్ఞా నారాయణ్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అయ్యంగార్, కిరిటీ, రాజ్ తిరందాసు ప్రధాన పాత్రలు పోషించారు.
Actor Ajay: ‘చక్రవ్యూహం’తో జోరు పెంచిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్!

Chakravyuham