Censor Issues : జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?

Jananayagan Toxic

Jananayagan Toxic

ఎట్టకేలకు దళపతి విజయ్ జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్ చేయడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు తమిళ తంబీలు. కాదు కాదు ఫెస్టివల్ చేసుకుంటున్నారు. తమ సీఎం పేరును ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఈగర్లీ వెయిటింగ్. 12 కట్స్, కొన్ని మార్పులు, సవరణలు చేసిన సీబీఎఫ్సీ.. ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. జననాయగన్‌ను జులై ఎండింగ్‌ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్.

రీసెంట్లీ ఓ మూవీ విషయంలో సీబీఎఫ్సీ చాలా స్ట్రిట్‌గా రూల్స్ ఫాలో అవుతోంది. మత పరమైన, వివాదాస్పదమైన టైటిల్స్, సీన్స్, కంటెంట్ ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో మేకర్స్ ఛేంజస్ చేయక తప్పనిపరిస్థితి. జన నాయగన్ మూవీ విషయంలో పెద్ద రాద్దాంతమే జరిగింది. ఎట్టకేలకు మార్పులు తప్పలేదు. కానీ నెక్ట్స్ టాక్సిక్ విషయంలో సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.. అంతే కాదు సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుస్తున్నారు. టాక్సిక్ నుండి ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ పరిశీలిస్తే.. వయెలెంట్ లేదంటే రొమాంటిక్ సీన్సే. గీతూమోహన్ దాస్ అడల్ట్ సినిమా చేస్తోందన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ యశ్ ఫిల్మ్.. ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే టాక్సిక్ సెన్సార్ గురించి సోషల్ మీడియాలో డిస్కర్షన్ షురూ అయ్యింది. జన నాయగన్‌కే ఇన్ని కట్స్ చెబితే.. టాక్సిక్ చూస్తే ఏం కట్ చేయాలో తేల్చుకోలేక సీబీఎఫ్సీ సభ్యులు తంటాలు పడతారేమోనని సెటైర్స్ పేలుస్తున్నారు. సెన్సార్ బోర్డుకు పీడకల రాబోతోంది అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. జన నాయగన్‌కు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఊపిరి పీల్చుకున్న కెవిఎన్‌కు మరోసారి తలనొప్పులు తప్పవంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.