మెగాస్టార్ చిరంజీవి ఈరోజు (ఆగస్టు 22) తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంతోషకరమైన సందర్భంలో ఆయనకు అభిమానుల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన సినిమాల నుంచి వరుస అప్డేట్స్ మెగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉదయం మెహర్ రమేష్‌తో చిరంజీవి నెక్స్ట్ మూవీ టైటిల్‌ను మహేష్ బాబు ఆవిష్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు. మీ సినిమా టైటిల్‌ని ఆవిష్కరించడం గౌరవంగా ఉంది. “భోళా శంకర్” టీం, నా స్నేహితుడు, దర్శకుడు మెహెర్ రమేష్, నా అభిమాన నిర్మాత అనిల్ సుంకర రాబోయే సంవత్సరం మీకు మంచి ఆరోగ్యం, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సర్!” అంటూ “భోళా శంకర్” టైటిల్ ను రివీల్ చేశారు.
Read Also : “చిరు 155” టైటిల్ రివీల్ చేసిన మహేష్
మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ “ఆచార్య” సెట్స్ లో తండ్రితో మర్చిపోలేని క్షణాలకు సంబంధించిన అందమైన వీడియోను పంచుకున్నారు. అల్లు అర్జున్,నాగబాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్, సమంత అక్కినేని, ప్రకాష్ రాజ్, శర్వానంద్, మహేష్ బాబు, బాబీ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ కొణిదెల వంటి ఇతర ప్రముఖులు “గాడ్ ఫాదర్” హీరోకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు.
A post shared by Naga Babu Konidela (@nagababuofficial)
A post shared by Puri Connects (@puriconnects)
A post shared by Allu Arjun (@alluarjunonline)
A post shared by Rana Daggubati (@ranadaggubati)
