ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి అనారోగ్యంతో ముంబైలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి సంగీత ప్రియులందరినీ కలచివేసింది. ఫిబ్రవరి 17న ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఆయన మృతికి సినీ పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, ఖుష్బుతో పాటు పలువురు ప్రముఖులు బప్పి లహిరి మృతికి నివాళులు అర్పిస్తూ, సంగీత ప్రపంచానికి ఆయన చేసిన కృషిని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు.
Bappi Lahiri : సినీ ప్రముఖుల సంతాపం
