Site icon NTV Telugu

RIP Narayan Das Narang : సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

Narayanadas K Narang

Narayanadas K Narang

ప్రస్తుత తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్ అధ్యక్షుడు, ఏషియన్ గ్రూప్ ఆఫ్ థియేటర్స్ అధినేత, గ్లోబల్ సినిమాస్ ఛైర్మన్, నిర్మాత, పంపిణీదారుడు, ఫైనాన్షియర్ నారాయణదాస్ నారంగ్ ఈరోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన లేరన్న విషయం తెలిసిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, శివకార్తికేయన్ వంటి హీరోలు నారాయణదాస్ నారంగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ట్వీట్లు చేశారు.

Pawan

https://twitter.com/ganeshbandla/status/1516292580623159299

నారాయణ్ కె.దాస్ నారంగ్ గారి మరణం విచారకరం: కొడాలి నాని

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణ్ కె. దాస్ నారంగ్ గారు సినీ ఇండస్ట్రీలో అజాత శత్రువు గా పేరొందారు . నైజాం లో ఎగ్జిబిటర్ మరియు పంపిణీదారులుగా విశేష సేవలందించారు .వారి మరణం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..

నారాయణ్ కె దాస్ నారంగ్ గారి మరణం నన్ను వ్యక్తిగతంగా బాధించింది: వల్లభనేని వంశీ

ఏషియన్ గ్రూప్స్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ కె.దాస్ నారంగ్ గారి మృతి చెందారన్న విషయం నన్ను వ్యక్తిగతంగా బాధించింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి దూరమవడం చాలా దురదృష్టం.. వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలుపుతూ.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను – వల్లభనేని వంశీ.

నారాయణ్ దాస్ నారంగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి.. నల్లమలుపు బుజ్జి!!

నారాయణ్ దాస్ గారితో, వారి కుమారుడు సునీల్ తో నాకు మంచి అనుబంధం ఉంది.. నారాయణ్ దాస్ గారు సడన్ గా ఇలా పోయారన్న వార్త వినగానే చాలా బాదేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను – నల్లమలువు బుజ్జి

నారాయణ్ కె. దాస్ గారు మరణం ఇండస్ట్రీకి ఎంతో తీరని లోటు.. వివి వినాయక్!!

డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాతగా సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరి తో స్నేహ పూర్వకంగా మెలిగే వ్యక్తి. అలాగే వారి కుమారుడు సునీల్ సక్సెస్ ఫుల్ పంపిణీ దారుడు. రీసెంట్ గా వరుసగా సినిమాలు నిర్మిస్తూ వున్నారు. అలాంటి టైంలో నారాయణ్ దాస్ గారు లేకపోవడం పరిశ్రమకి ఎంతో తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలి – వివి వినాయక్

Exit mobile version