కింగ్ నాగార్జున ఆగస్టు 29న తన 62 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులు సోషల్ మీడియా “హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు నాడు ఆయన నెక్స్ట్ సినిమాలు “ది ఘోస్ట్”, “బంగార్రాజు” ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఆయన భార్య అమల, కోడలు సమంత, చిరంజీవి, రవితేజ, మహేష్ బాబు, రాధికా శరత్‌కుమార్, నిర్మాత అనిల్ సుంకర మరియు నటుడు సుశాంత్ వంటి ప్రముఖులు నాగార్జున 62వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
బర్త్ డే : కింగ్ నాగార్జునకు సెలెబ్రిటీల విషెస్
