Case to be filed on Bigg Boss 7 Telugu Team: హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెప్పబడుతున్న కొందరు అత్యుత్సాహం చూపించారు. బిగ్ బాస్ ఫినాలే ముగిసిన అనంతరం స్టూడియో నుంచి బయటికొచ్చిన కార్లపై వరుసగా దాడి చేశారు. తొలుత రన్నరప్ అమర్ దీప్ కారు అద్దాలు ధ్వంసం చేయగా ఆ తర్వాత కాసేపటికి బయటికొచ్చిన కంటెస్టెంట్ అశ్విని శ్రీ, కారుతో పాటు పాత సీజన్ కంటెస్టెంట్, ఈ సీజన్ బజ్ హోస్ట్ గీతు రాయల్ వాహనాలపైనా దాడి చేశారు. తర్వాత అటుగా వచ్చిన ఒక ఆర్టీసీ బస్సుపై కూడా దాడిచేసి అద్దాలు పగుల గొట్టారు. ఇక రతిక కారుపై కూడా దాడికి ప్రయత్నించగా ఆమె చాకచక్యంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఇక ఈ అంశం మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. అభిమానులు ఆర్టీసీ బస్ లను ధ్వంసం చేసిన ఘటనలో కేసులు పెట్టామని, అభిమానం పేరుతో యువకులు జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు.
Pallavi Prashanth : బరితెగించిన అభిమానులు.. కప్ కొట్టిన పల్లవి ప్రశాంత్ కి షాక్ ఇచ్చిన పోలీసులు
బస్ లపై దాడులు జరుగుతుంటే అడ్డుకోలేని బిగ్ బాస్ నిర్వాహకులను కూడా బాధ్యులను చేస్తామని, బిగ్ బాస్ నిర్వాహకులపై కేసులు పెడతామని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్న ఆయన ఆర్టీసీకి నష్టం చేస్తే అది ప్రజలకే నష్టం అని ఆయన అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన అభిమానులపై ఈ కేసులు నమోదు చేయగా ఆరు బస్సులు, ఓ పోలీస్ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలు ఫ్యాన్స్ ధ్వంసం అయినట్టు గుర్తించారు. ఇక సీసీ ఫుటేజీ, వీడియోలలో వచ్చిన ఆధారాలతో నిందితులను గుర్తించామని ఈ దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ మొదలు పెట్టి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సుమోటోగా కేసు నమోదు చేశారు. పోలీసులు 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద ఫైల్ చేశారని తెలుస్తోంది.
