Naga Suseela: హీరో సుశాంత్, తల్లిపై పోలీసు కేసు.. అసలు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Case filed on Nagarjuna Sister Naga Susheesla: ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున సోదరి, సినీ హీరో సుశాంత్ తల్లి, సినీ నిర్మాత నాగ సుశీల పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నాగ సుశీల, మరో 12 మందితో కలిసి తనపై దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. నాగ సుశీల, శ్రీనివాస్‌ల మధ్య కొంతకాలంగా భూవివాదం సాగుతుందని, వీరు గతంలో వ్యాపార భాగస్వామ్యులుగా ఉన్నారని చెబుతున్నారు. నాగసుశీల, శ్రీనివాస్ కొన్నేళ్ల నుంచి వివిధ వ్యాపారాల్లో పార్టనర్స్‌గా ఉండి ఓ సినిమా బ్యానర్ ను కూడా స్థాపించారు. శ్రీ నాగ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించి వీరు కొన్ని సినిమాలు చేశారు.
Balakrishna: దటీజ్ బాలయ్య.. బాబు అరెస్ట్.. అయినా తగ్గట్లేదుగా!
Also Read
సుశాంత్ హీరోగా మూడు సినిమాలు చేయగా ఆ సినిమాల్లో ‘కరెంట్’ హిట్ అయినప్పటికీ ఆ తరవాత వచ్చిన అడ్డా, ఆటాడుకుందాం రా కూడా అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసిన క్రమంలో మనస్పర్థలు ఏర్పడి దూరం కూడా పెరిగింది. ప్రస్తుతం చింతలపూడి శ్రీనివాస్ శ్రీజ ప్రకృతి దర్శపీఠం నిర్వాహకుడిగా ఉండగా ఈ నెల 12న నాగసుశీల, ఆమె అనుచరులు దాడికి పాల్పడినట్టుగా కేసు నమోదు చేశారు. నిజానికి 2017 లో తన అనుమతి లేకుండా భూములు అమ్మాడని ఆరోపిస్తూ చింతలపూడి శ్రీనివాస్‌పై నాగ సుశీల పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా తనను లాకప్‌లో పెట్టి తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ అప్పట్లో ఆరోపించారు. ఇక ఇప్పుడు సుశీల మీద కేసు నమోదైన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!