NTV Telugu Site icon

Naga Suseela: హీరో సుశాంత్, తల్లిపై పోలీసు కేసు.. అసలు ఏమైందంటే?

Case Filed On Naga Susheesla

Case Filed On Naga Susheesla

Police Case filed on Nagarjuna Sister Naga Susheesla: ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున సోదరి, సినీ హీరో సుశాంత్ తల్లి, సినీ నిర్మాత నాగ సుశీల పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నాగ సుశీల, మరో 12 మందితో కలిసి తనపై దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. నాగ సుశీల, శ్రీనివాస్‌ల మధ్య కొంతకాలంగా భూవివాదం సాగుతుందని, వీరు గతంలో వ్యాపార భాగస్వామ్యులుగా ఉన్నారని చెబుతున్నారు. నాగసుశీల, శ్రీనివాస్ కొన్నేళ్ల నుంచి వివిధ వ్యాపారాల్లో పార్టనర్స్‌గా ఉండి ఓ సినిమా బ్యానర్ ను కూడా స్థాపించారు. శ్రీ నాగ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించి వీరు కొన్ని సినిమాలు చేశారు.

Balakrishna: దటీజ్ బాలయ్య.. బాబు అరెస్ట్.. అయినా తగ్గట్లేదుగా!

సుశాంత్‌ హీరోగా మూడు సినిమాలు చేయగా ఆ సినిమాల్లో ‘కరెంట్’ హిట్ అయినప్పటికీ ఆ తరవాత వచ్చిన అడ్డా, ఆటాడుకుందాం రా కూడా అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసిన క్రమంలో మనస్పర్థలు ఏర్పడి దూరం కూడా పెరిగింది. ప్రస్తుతం చింతలపూడి శ్రీనివాస్ శ్రీజ ప్రకృతి దర్శపీఠం నిర్వాహకుడిగా ఉండగా ఈ నెల 12న నాగసుశీల, ఆమె అనుచరులు దాడికి పాల్పడినట్టుగా కేసు నమోదు చేశారు. నిజానికి 2017 లో తన అనుమతి లేకుండా భూములు అమ్మాడని ఆరోపిస్తూ చింతలపూడి శ్రీనివాస్‌పై నాగ సుశీల పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా తనను లాకప్‌లో పెట్టి తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ అప్పట్లో ఆరోపించారు. ఇక ఇప్పుడు సుశీల మీద కేసు నమోదైన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది.

Show comments