NTV Telugu Site icon

Turbo: బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న మమ్ముట్టి.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా!

Tb

Tb

Turbo Box Office Strom in Kerala: విభన్నమైన కథలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో మ‌ల‌యాళం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్నాడు అగ్ర హీరో మ‌మ్ముట్టి. భ్ర‌మ‌యుగంతో కొత్త ప్ర‌యోగం చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్ అందుకున్న‌ మ‌మ్ముట్టి తాజాగా “ట‌ర్బో” మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. వైశాఖ్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ బడ్జెట్ గా తెరకెక్కిన ఈ మూవీ గురువారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజైంది.యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో క‌న్న‌డ న‌టుడు రాజ్‌బీ శెట్టి, టాలీవుడ్ యాక్ట‌ర్ సునీల్ విల‌న్స్‌గా న‌టించారు. ప్రస్తుతం మాలీవుడ్ ఇండస్ట్రీ లో టర్బో రికార్డ్స్ తిరగరాస్తుంది.

Also Read; Laapataa Ladies: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న చిన్న సినిమా..ఏకంగా యానిమల్ రికార్డ్ బ్రేక్ చేసిందిగా

రిలీజ్ అయినా మొదటి రోజు 6.15 కోట్ల గ్రాస్‌తో 2024 సంవత్సరంలో మ‌ల‌యాళం బాక్సాఫీస్‌ అతిపెద్ద ఓపెనింగ్‌గా అవతరించడమే కాకుండా, మమ్ముట్టి కెరీర్‌లో అతిపెద్ద ఓపెనింగ్‌గా మైలురాయిగా నిలిచింది. ఇక ఈ ట‌ర్బో మూవీ ఓవ‌ర్‌సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఔట్ అండ్ ఔట్ మాస్ మ‌సాలా యాక్ష‌న్ మూవీ అని విల‌న్‌గా రాజ్ బీ శెట్టి యాక్టింగ్‌తో ఇర‌గ‌దీశాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు. అత‌డి విల‌నిజం ఎలేవేషన్స్ వేరే లెవెల్ అని, మ‌మ్ముట్టి, రాజ్ బీ శెట్టి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్స్ గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తాయ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు. ట‌ర్బో జోస్ పాత్ర‌లో మ‌మ్ముట్టి అద‌ర‌గొట్టాడ‌ని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. చాలా కాలం త‌ర్వాత మాస్ రోల్‌లో మ‌మ్ముట్టి దుమ్మురేపాడ‌ని అంటున్నారు. ట‌ర్బోలో మ‌మ్ముట్టి హీరోయిజం, ఎలివేష‌న్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయ‌ని చెబుతోన్నారు.