NTV Telugu Site icon

Vijaya Kanth: కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యం విషమం.. ట్వీట్ చేసిన రజినీకాంత్

Vijayakanth

Vijayakanth

కోలీవుడ్ సీనియర్ హీరో విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందని కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కెప్టెన్ విజయకాంత్ గా తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఆయన సుపరిచితుడే. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇకపొతే విజయకాంత్ గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. సర్జరీల మీద సర్జరీలు చేస్తూ ఉన్నారు వైద్యులు.. అయినా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆయనను బయట చూసి ఎన్నో ఏళ్ళు అయిపోతుంది. గతంలో ఒక సర్జరీ చేయించుకొని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న విజయకాంత్ కు మరో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సర్జరీతో ఆయన కుడి పాదం నాలుగు వేళ్లు తొలగించినట్లు వార్తలు గుప్పమన్నాయి.

ఇక ఈ వార్తపై విజయకాంత్ పార్టీ సభ్యులు స్పందిస్తూ.. నాలుగు వేళ్లు తొలగించడమా అబద్దమని, రక్త ప్రసారం జరగడానికి ఒక వేలును మాత్రమే తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్నారని తెలిపారు. ఇక దీంతో ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక విజయకాంత్ ఆరోగ్యం గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ ట్వీట్ చేశాడు . “నా అద్భుతమైన స్నేహితుడు త్వరగా కోలుకోని మళ్లీ మునుపటి కెప్టెన్ లా గర్జించాలని దేవుడ్ని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments