NTV Telugu Site icon

Captain Miller: ఏది సామీ ఈ అరాచకం.. ధనుష్ విశ్వరూపం.. దడుచుకుంటారేమో

Dhanush

Dhanush

Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. టీజీ త్యాగరాజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, తెలుగు నటుడు సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కిల్లర్ .. కిల్లర్.. కెప్టెన్ మిల్లర్ అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బ్రిటిష్ సైనికులపై పోరాడే యోధుడుగా ధనుష్ కనిపించాడు. ఇందులో వోకల్స్ ను ధనుష్ అందించడం విశేషం. ఇక జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది. సినిమా థీమ్ ను మొత్తం ఈ సాంగ్ లో చూపించేశారు. ధనుష్ క్యారెక్టర్.. ఎలా ఉండబోతుంది అనేది లిరిక్స్ ను బట్టి అర్ధమవుతుంది.

Mohan Babu: భక్తవత్సలం నాయుడు టూ మోహన్ బాబు.. 48 ఏళ్ల నట ప్రస్థానం వేరే లెవెల్ అంతే

హీరో ఎలివేషన్ కు తగ్గ లిరిక్స్ ను రాకేందు మౌళి అందించగా.. తెలుగులో హేమచంద్ర తన బేస్ వాయిస్ తో అదరగొట్టాడు. నేను డెవిల్ అంటూ.. కెప్టెన్ మిల్లర్ తన గురించి చెప్తున్నట్లు ఈ లిరిక్స్ ఉన్నాయి. “ఒంటరిగా వస్తే తలి తేగిపడులే.. సైన్యంతో వస్తే శవ వర్షాలే
జిత్తుల నక్కలకి రొమ్ములు చీలే.. యెద్దుల కొమ్ములు మట్టిని కరిచేలే” అంటూ ఎంతో పవర్ ఫుల్ లిరిక్స్ కు ధనుష్ విజువల్స్ అయితే అరాచకం. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళను వేటాడేటప్పుడు ధనుష్ కళ్లు.. జింకను వేటాడే పులిలానే కనిపించాయి. సాంగ్ వీడియోలో ధనుష్ విశ్వరూపం చుపించాట్లు కనిపిస్తున్నాడు. ఇక ఈ సాంగ్ కు ధనుష్ నటనకు.. థియేటర్ లో అభిమానులు దడుచుకుంటారేమో అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.