NTV Telugu Site icon

Aditi Rao Hydari: సిద్దార్థ్ లవర్ ఎంత అందంగా ఉందో చూడండి

Aditi

Aditi

Aditi Rao Hydari: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితి రావు హైదరితో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెల్సిందే. పెళ్లి గురించి ఊసు ఎత్తని ఈ జంట.. నిత్యం కెమెరా కంటికి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కనిపిస్తున్నారు. తెలుగులో మహాసముద్రం సినిమా సెట్ లో జరిగిన పరిచయం.. వీరి ప్రేమకు పునాది వేసింది. ప్రస్తుతం ఇద్దరు తమ కెరీర్ లలో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ చిన్నది కేన్స్ ఫెస్టివెల్ రెడ్ కార్పెట్ పై మెరిసింది. సిండ్రెల్లా డ్రెస్ లో కనిపించి షాక్ ఇచ్చింది. స్వతహాగా రాజవంశానికి చెందిన మహిళా కావడంతో అదితి లో ఆ రాజసం కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ ఈవెంట్ కు ముద్దుగుమ్మ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా తన అందంతో మన్త్ర ముగ్దులను చేసింది.బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ అపి ఎదను కప్పి ఉంచే పెద్ద పువ్వు.. ఎద భాగం, మోకాళ్ళ వరకే ఉన్న డ్రెస్.. కాట్మకోనీ పాదరక్షలతో అమ్మడు అద్భుతంగా మెరిసింది. ముఖ్యంగా చూపులు.. అదితి మెస్మరైజ్ చేసే చూపులతో అక్కడ ఉన్నవారందరిని కట్టిపడేసింది.

Adah Sharma: అదాశర్మను బెదిరించిన హైదరాబాదీ యువకుడు.. దాన్ని లీక్ చేస్తూ

తులా జ్యువెలరీతో బ్లింగ్ డాష్ లుక్ వచ్చిన అదితి .. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ” మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది.. ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇంత అందం ఉంది కాబట్టే.. సిద్దార్థ్ ప్రేమలో పడిపోయాడు అని కొందరు.. సూపర్ అదితి అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అదితి.. విజయ్ సేతుపతి- అరవింద్ స్వామి- సిద్దార్థ్ జాదవ్ లతో గాంధీ టాక్స్ లో కనిపించనుంది. దీంతో పాటు సంజయ్ లీలా బన్సాలీ ప్రతిష్ఠాత్మక సిరీస్ హీరామండి లో కనిపిస్తుంది. మరి ఈ సినిమాలు అమ్మడికి ఎలాంటి పేరు సంపాదించి పెడతాయో చూడాలి.

Show comments