Site icon NTV Telugu

Sree Vishnu: క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అయినా హిట్ ఇస్తాడా?

Sree Vishnu

Sree Vishnu

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న శ్రీ విష్ణు, మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆడియన్స్ ని డిజప్పాయింట్ చెయ్యడు అనే నమ్మకాన్ని కలిగించిన శ్రీ విష్ణు, ఇప్పుడు ఫ్లాప్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాడు. గత అయిదారు సినిమాలుగా శ్రీ విష్ణు ప్రేక్షకులని నిరాశ పరుస్తూనే ఉన్నాడు. అతను సెలెక్ట్ చేసుకునే కథల్లో మాస్ ఎలిమెంట్స్ కోసం ట్రై చెయ్యడమే శ్రీ విష్ణు ఫ్లాప్స్ కి కారణం అయ్యింది. ఈ విషయం రియలైజ్ అయినట్లు ఉన్నాడు, శ్రీ విష్ణు ఈసారి తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యామిలీ, ఫన్, లవ్, ఎంటర్తైన్మెంట్ లాంటి అంశాలు ఉన్న కథని ఎంచుకోని ‘సామజవరగమనా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘సామజవరగమన’ సినిమాలో బిగిల్ మూవీలో యాసిడ్ పడిన ఈవ్ టీజింగ్ బాధితురాలిగా నటించిన రెబా జాన్ హీరోయిన్ గా నటిస్తోంది.

రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది. శ్రీ విష్ణు ప్రేమించిన అమ్మాయితోనే రాఖీ ఎందుకు కట్టించుకున్నాడు అనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చెయ్యడంలో ప్రమోషనల్ కంటెంట్ సక్సస్ అయ్యింది. ప్రేమించిన అమ్మాయితో రాఖి కట్టించుకునే అలవాటు చిన్నప్పటి నుంచి ఉన్న శ్రీ విష్ణు అసలు ఎందుకు అలా చేస్తున్నాడు అంటే జూన్ 29న సామజవరగమనా సినిమా రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా సెన్సార్ వర్క్ కంప్లీట్ చేసుకోని… క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. మరి ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అయినా శ్రీ విష్ణు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Exit mobile version