NTV Telugu Site icon

KP Chowdary: డ్రగ్స్ కేసులో ఆ ఇద్దరు తెలుగు హీరోయిన్లు.. అడ్డంగా బుక్కయ్యారుగా!

Kp Chowdary Heroines

Kp Chowdary Heroines

Calls between two tollywood heroines and KP Chowdary: కబాలి చిత్ర నిర్మాత కె.పి చౌదరి అరెస్ట్ టాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. నిజానికి ముందుగా అతను టాలీవుడ్ లో ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోలేదేమో అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అతని కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది టాలీవుడ్ తో ఉన్న లింకులు బయటపడుతున్నాయి. అతను టాలీవుడ్ లో అనేకమందితో దిగిన ఫోటోలు అతని ఫోన్లో లభ్యమయ్యాయి. పలువురు ఫేమస్ ఆర్టిస్టులతో కూడా కేపీ చౌదరి సన్నిహితంగా మెలుగుతున్నట్టుగా ఆ ఫోటోల్లో ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు దగ్గర కస్టడీకి పర్మిషన్ తీసుకున్న తర్వాత విచారణ జరుపుతున్న నేపథ్యంలో కేపీ చౌదరి పూర్తిస్థాయిలో నిజాలు బయట పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు… కేపీ చౌదరి లిస్టులో ఏకంగా ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లుగా చెబుతున్నారు.
Tollywood Actress: కేపీ చౌదరితో వందల ఫోన్ కాల్స్ మాట్లాడిన సీనియర్ నటి ఎవరు?
బిగ్ బాస్ లో పాల్గొన్న ఒక తెలుగు హీరోయిన్ అదే విధంగా తెలుగులో కొన్ని ఐటమ్ సాంగ్స్ చేసిన మరో హీరోయిన్ కూడా ఉందని వీరిద్దరితో కేపీ చౌదరి గంటల తరబడి 100 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడాడని గుర్తించారు. అయితే ఆ హీరోయిన్లు ఎవరు అనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి బయట పెట్టేందుకు పోలీసులు ఇష్టపడడం లేదు. నిజంగా డ్రగ్స్ వారు తీసుకున్నారా? అనే విషయం మీద ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలితే అప్పుడు మాత్రమే మీడియా ముఖంగా వారి పేర్లు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను నిర్మాత కాబట్టి హీరోయిన్లతో ఫోన్లు మాట్లాడారా లేక డ్రగ్స్ డీలింగ్ వ్యవహారాలు కూడా వారితో నడిపాడా అనే విషయం మీద పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం మీద పోలీసులు ఒక క్లారిటీ ఇస్తే తప్ప నిజంగా అసలు ఏం జరిగింది? ఆ ఇద్దరు హీరోయిన్లకు డ్రగ్స్ కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అనే విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Show comments