Site icon NTV Telugu

Calling Sahasra: సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Calling Sahasra

Calling Sahasra

Calling Sahasra to Release on December 1: బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు హీరోగా చేసిన సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

Santosham OTT Awards 2023:గ్రాండ్ గా ‘సంతోషం’ ఓటీటీ అవార్డ్స్‌.. విన్నర్స్ వీరే!

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్ర ఔట్ పుట్ బాగా వ‌చ్చిందని, సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయని అన్నారు. డిసెంబ‌ర్ 1న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేస్తున్నామని డైరెక్టర్ అరుణ్ సినిమాను తెరకెక్కించిన తీరు సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందని అన్నారు. సుధీర్‌ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదని, అంద‌రినీ అంచ‌నాల‌ను మించేలా సుధీర్‌ను స‌రికొత్త కోణంలో ప్రెజంట్ చేసేలా కాలింగ్ స‌హ‌స్రలో ఆయ‌న క్యారెక్ట‌ర్ ఉంటుందన్నారు.ఇది అన్నీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ, తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నాం, మూవీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుందన్నారు. ఇక ఈ సినిమాలో శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version