Site icon NTV Telugu

C202 Trailer: ఆసక్తికరంగా ‘సి 202’ ట్రైలర్..వణికిస్తున్న తనికెళ్ళ భరణి

C202 Trailer

C202 Trailer

C202 Trailer: మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలో మనోహరి కెఎ నిర్మాతగా మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’ (C 202). ఈ సినిమా మొత్తాన్ని రాత్రిపూట చిత్రీకరించడం గమనార్హం. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో ఈ సినిమా బిజీగా ఉంది. ఇక ఈరోజు ఒక డైలాగ్ కూడా లేకుండా ముఖ్య తారాగణాన్ని చూపిస్తూ అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్ తో రెండు నిమిషాల ఎనిమిది సెకెన్ల ట్రైలర్ ను టీం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ “ఈరోజు ‘సి 202’ (C 202) చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేసాం, ఒక డైలాగ్ కూడా లేకుండా క్యారెక్టర్ లను చూపిస్తూ మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులకు మా సినిమా మీద అంచనాలు పెంచేలా రూపొందించామని అన్నారు. మా ట్రైలర్ ను ‘సౌండ్ ఆఫ్ సి 202 (Sound of C 202) అని పిలుచుకుంటున్నాము, మా ట్రైలర్ ని మంచి సౌండ్ సిస్టంతో చూడండి, ఖచ్చితంగా మా ‘సి 202’ (C 202) చిత్రం మీద మీ అంచనాలు పెరుగుతాయని అన్నారు. మా ‘సి 202’ (C 202) చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడిందన్న ఆయన కథ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా అద్భుతమైన సస్పెన్స్ తో భయపడే హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమా ని చిత్రకరించామని అన్నారు. షూటింగ్ అంత పూర్తి అయింది. ప్రస్తుతానికి రామానాయుడు స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, సాంకేతికంగా మేము హై-ఎండ్ కెమెరాలను మరియు మంచి లైటింగ్ పరికరాలు ఉపయోగించామని అన్నారు.
YouTube video player

Exit mobile version