దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది అంటూ ప్రచారం జరుగుతుండగా, మరోవైపు ఇద్దరు హీరోలూ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతున్నారు. దర్శకుడు శివ కొరటాలతో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా “ఎన్టీఆర్ 30” అనే టైటిల్‌తో పిలుస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే… ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన పలువురు హీరోయిన్ల పేర్లు విన్పించగా, తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సీతమ్మే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా కన్పించబోతోందని అంటున్నారు.
Read Also : పవన్ సినిమాకు దేవి శ్రీ షాకింగ్ రెమ్యూనరేషన్ ?
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ “ఎన్టీఆర్ 30″లో తారక్ తో రొమాన్స్ చేయనుంది. డైరెక్టర్ కొరటాల శివ చిత్రంలో ఎన్టీఆర్, అలియా జోడీ బాగుంటుందని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానులు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ జోడీపై పలు కామెంట్స్ చేస్తున్నారు. టైటిల్స్ కూడా వాళ్లే చెప్పేస్తున్నారు. ఒకరు రొమాంటిక్ సాంగ్ ఉండాలంటే, మరొకరు ఎన్టీఆర్ తో అలియా అనే అఫిషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో వీరిద్దరూ కలిసి సరదాగా ఉన్న పిక్స్ ను షేర్ చేస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ లో అలియా భట్ నటిస్తుందా ? లేదా ? అనే విషయానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తి స్వింగ్‌లో ఉండగా, అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. గతంలో “ఎన్టీఆర్ 30” ఎన్టీఆర్ సరసన సమంతను తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో అధికారికంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి త్వరలో చిత్రాన్ని ప్రారంభించాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ గతంలో “జనతా గ్యారేజ్”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
