NTV Telugu Site icon

Bunny Vasu: అల్లు అరవింద్ థియేటర్లు.. అసలు సీక్రెట్ చెప్పేసిన బన్నీవాసు

Bunny Vasu Allu Aravind

Bunny Vasu Allu Aravind

Bunny Vasu Clarity on Allu Aravind Theatres: అల్లు అరవింద్ కి ఉన్న థియేటర్లు గురించి బన్నీ వాసు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్న బన్నీ వాసు ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఆగస్టు 16వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఎన్టీవీతో ముచ్చటిస్తూ ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టారు. అదేంటంటే చాలామంది అల్లు అరవింద్ కి చాలా థియేటర్లు ఉన్నాయి అనుకుంటారు కానీ నిజానికి ఆయనకు ఉన్నది హైదరాబాదులో ఉన్న AAA ఒక్కటే అని ఆయన చెప్పుకొచ్చారు.

Bunny Vasu: కల్కి కలెక్షన్స్ పై బన్నీ వాసు క్లారిటీ

అది కూడా ఏషియన్ వాళ్ళతో భాగస్వామ్యంలో చేస్తున్న థియేటర్ అని అన్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 20 ప్రాపర్టీలు ఇప్పుడు అరవింద్ గారు తీసుకున్నారని అవి కూడా దాదాపు భారీగా ఖర్చు పెట్టి తాము సిద్ధం చేస్తున్నామని అన్నారు. 9, 10 ఏళ్ళు లీజు కాలం ఉండేలాగా వాటిని మేము డెవలప్ చేస్తున్నామని ఆయన అన్నారు. తమ సొంత సినిమానే రిలీజ్ చేసుకోలేని పరిస్థితులలో ఆగస్టు 15 నుంచి 16వ తేదీకి వాయిదా వేశామని దీన్ని బట్టి అల్లు అరవింద్ గారికి థియేటర్లు ఉన్నాయి అనే జరిగే ప్రచారంలో ఎంత నిజం ఉందో అర్థం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.

Show comments