NTV Telugu Site icon

Bullet Bhaskar: జబర్దస్త్ షోలో గుండు కొట్టించుకున్న బుల్లెట్ భాస్కర్.. ఖుష్బుతో ఊహించని గొడవ.. ఏమైందంటే?

Bullet Bhaskar Gundu

Bullet Bhaskar Gundu

Bullet Bhaskar Clean shave to head Promo Goes Viral in Social Media: జబర్దస్త్ షోలో జనాల అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు తిట్టుకోవడాలు, ప్రేమ యవ్వారాలు, ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నట్టు ప్రోమోలు కట్ చేసి వదులుతూ ఉంటారు. ఇక తాజాగా షోలో బుల్లెట్‌ భాస్కర్‌ గుండు గీయించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. `ఎక్స్ ట్రా జబర్దస్త్` కామెడీ షోలో బుల్లెట్‌ భాస్కర్‌ తన టీమ్‌తో కలిసి `నిజం` సినిమా స్కిట్‌ని ప్రదర్శించగ గోపీచంద్‌ గా బుల్లెట్‌ భాస్కర్‌, మహేష్‌గా నరేష్‌, మహేష్ మదర్‌ రోల్‌లో ఫైమా సందడి చేశారు. గోపీచంద్‌ పాత్రలో బుల్లెట్‌ భాస్కర్‌ పెద్దమ్మ తల్లికి అమ్మోరు తల్లిని బలియండ్రా అని అంటూ ఉండగా జడ్జ్ కృష్ణభగవాన్‌ అభ్యంతరం తెలిపారు. సినిమాలో గోపీచంద్‌ పెద్దమ్మ తల్లి వద్దకు వెళ్లినప్పుడు ఆయనకు గుండు ఉంటుందని అంటే భాస్కర్‌ రియాక్ట్ అవుతూ, ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి సర్‌, మధ్యలో అంటే కష్టమవుతుందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ క్రమంలో ఖుష్బూ రియాక్ట్ అయ్యి స్ఫూప్‌ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి, ఇక్కడ ఫీల్‌ అవ్వడానికి ఏం లేదని అన్నారు. భాస్కర్ తాను స్కిట్‌ కోసం ప్రాణమిస్తానని అంటూ జబర్దస్త్ షోలోనే ఆయన గుండు గీయించుకుని షాకిచ్చాడు. షో స్టేజ్‌ మీదే, స్కిట్‌లోనే ఆయన తన గుండు గీయించుకుని `నిజం`లో గోపీచంద్‌లా మారిపోయాడు.

Karthika Nayar: ఘనంగా ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి.. స్పెషల్ ఎట్రాక్షన్ గా చిరంజీవి

దీంతో అటు కృష్ణభగవాన్, ఖుష్బూ, ఇటు యాంకర్ రష్మి, ఇతర కమెడియన్లంతా షాక్‌ కాగా భాస్కర్‌ ఓకేనా సర్‌ అంటూ కృష్ణభగవాన్‌ ను అడిగితే ఆ ఎఫెక్ట్ కావాలన్నాం గానీ, నిజంగానే గుండు గీయించుకుంటే ఎలా అన్నాడు. అది మీరు గుండు గీయించుకోవడానికి ముందు చెప్పాలి, అంతా అయిపోయాక పోయిన బొచ్చు వెనక్కి వస్తుందా అని భాస్కర్ ఘాటుగా రియాక్ట్ కావడంతో జడ్జ్ ఖుష్బూ ఫైర్‌ అయ్యింది. మాకు ఒక రెస్పాన్సిబులిటీ ఇచ్చారు, అందుకే ఈ సీట్‌ మీద ఉన్నాం తప్పు అనిపించినపుడు ఒక కామెంట్‌ కూడా ఇవ్వడానికి ఫ్రీడమ్‌ లేదంటే ఎలా అని అంటూ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యింది. భాస్కర్ ఏదో అనబోతూ ఉండగా నేను నీతో మాట్లాడటం లేదని పేర్కొంది. ఒక జడ్జ్ గా ఒక ప్రశ్న అడగడానికి నాకు రైట్స్ లేదంటే ఎందుకు ఉండాలి ఇక్కడ అంటూ ఖుష్బూ, కృష్ణభగవాన్‌ తమ సీట్ల నుంచి లేచి వెళ్లిపోగా భాస్కర్‌ కూడా థ్యాంక్యూ మేడం అంటూ స్టేజ్‌ నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయింది అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే వ్యూయర్స్ కోసం ఇలా చాలా సార్లు చేస్తుంటారు. ఇది కూడా అందులో భాగమేనని టాక్ కూడా ఉంది. చూడాలి ఇందులో నిజం ఎంత ఉందనేది.