Bubblegum Movie Free Tickets for Students in Telugu States: ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అయిన మూవీ ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కూడా అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిస్థాయి యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా యువతరాన్ని ఎట్రాక్ట్ చేసేలా ఉందని చెప్పవచ్చు. లిప్ లాక్స్ తో కుర్ర జంట రెచ్చిపోగా సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది.
Saindhav Censor: సైంధవ్ సెన్సార్ రిపోర్ట్
ఇక ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకి ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు సాయంత్రం ఆరు గంటల వరకు స్టూడెంట్స్ కి ఈ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్టు వెల్లడించారు. అయితే అన్ని థియేటర్స్ కాదు అనుకోండి, సెలెక్ట్ చేసిన కొన్ని థియేటర్స్ లో 18ప్లస్ స్టూడెంట్స్ కి ఈ సినిమా ఫ్రీగాచూసే అవకాశం ఇచ్చారు. ఈరోజు ఆరు గంటలకి అయితే వైజాగ్ చిత్రాలయ మాల్, భీమవరం విజయలక్ష్మీ థియేటర్, విజయవాడ లైలా మాల్, ఎన్వీఆర్ వేల్రామ్స్ థియేటర్ తిరుపతిలో షోలు ఫ్రీగా చూసే అవకాశం కల్పించారు. ఇక రేపు హైదరాబాద్ శాంతి, మూసాపేట్ లక్ష్మీకళ, కొంపల్లి సినీ ప్లానెట్, అమీర్ పేట AAA సినిమాస్, కుషాయిగూడ తాళ్ళూరి థియేటర్ లలో చూసే అవకాశం ఉంది.
Bubblegum