ఆకట్టుకుంటున్న మల్లూ స్టార్స్ ఫ్యామిలీ డ్రామా… “బ్రో డాడీ” ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 2019 బ్లాక్‌బస్టర్ “లూసిఫర్”తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కాబోలో వస్తున్న రెండవ చిత్రం “బ్రో డాడీ”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్టు అర్థమవుతోంది. ట్రైలర్ లో మోహన్‌లాల్, మీనా జంటగా, పృథ్వీరాజ్ వారి కొడుకుగా కన్పించారు. మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు “బ్రో డాడీ” ట్రైలర్ లో ఉన్న వినోదాత్మక సన్నివేశాలు ఈ కుటుంబ కథా చిత్రంపై ఆసక్తిని పెంచేశాయి.
Read Also : ఏపీ సీఎం జగన్ కు ఆర్జీవీ హెచ్చరిక
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని ఆశీర్వాద్ సినిమాస్ ద్వారా ఆంటోనీ పెరుంబవూరు నిర్మించారు. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, ఉన్ని ముకుందన్, లాలూ అలెక్స్, మురళీ గోపీ, కనిహా, సౌబిన్ షాహిర్ వంటి స్టార్స్ అంతా సినిమాలో భాగమయ్యారు. ఈ చిత్రానికి దీపక్ దేవ్ నేపథ్య సంగీతం అందించగా, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. “బ్రో డాడీ” డైరెక్ట్ ఓటిటికి సిద్ధం అవుతోంది. జనవరి 26న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది ఈ కామెడీ కేపర్.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!