Site icon NTV Telugu

విమాన ప్రమాదంలో స్టార్ సింగర్ దుర్మరణం..

బ్రెజిల్ స్టార్ సింగర్, లాటిన్ గ్రామీ అవార్డ్ విజేత మారిలియా మెండోంకా విమాన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. శుక్రవారం బ్రెజిల్‌లోని మినాస్ గెరియాస్ స్టేట్‌లో లో జరిగిన ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఆమె మృతిచెందడం హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. కరాటింగా నగరంలో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్‌ కోసం తన సహాయకులతో కలిసి శుక్రవారం ప్రైవేట్ జెట్‌లో బయల్దేరారు. కొద్దిడ్డూరం వెళ్లిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కింద ఉన్న విద్యుత్ లైన్ కి తగిలి.. ఒక నది వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ప్రస్తుతం ఈ ఘటన హాలీవుడ్ ని కలిచివేస్తోంది.

Exit mobile version