గత కొద్ది నెలలుగా తెలుగువారిని అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు చేరుకుంది. ఈ సీజన్ కు ఆదివారంతో తెరపడనుంది. ఫైనలిస్ట్ లుగా సన్ని, షణ్ముక్, శ్రీరామచంద్ర, మానస్, సిరి పోటీపడుతున్నారు. వీరిలో విజేతగా నిలిచేది ఎవరన్నది పక్కన పెడితే ఈ ఫినాలే లో ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ సందడి చేయనుండటం విశేషం. శనివారం ‘బ్రహ్మాస్త’ సినిమా మోషన్ పోస్టర్ లాంఛింగ్ కోసం హైదరబాద్ వచ్చింది ‘బ్రహ్మాస్త’ టీమ్. ఇక ఇందులో నటించిన నాగార్జున బిగ్ బాస్ హోస్ట్. ఈ సినిమాను సమర్పిస్తున్నది రాజమౌళి. వీరు కాకుండా సినిమాలో నటించిన రణ్ బీర్ కపూర్, అలియాభట్, నిర్మించిన కరణ్ జోహార్, దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ ఫినాలేలో పాలు పంచుకున్నట్లు సమాచారం.
Read Also : నాని సెన్సార్ టాక్ ని అధిగమిస్తాడా!?
ఇక ఈ సీజన్ లో విజేతగా నిలిచేది ఎవరు? అన్న ప్రశ్నకు ప్రధానమైన పోటీ సన్నీ, షణ్ముక్ మధ్య ఉన్నట్లు వినిపిస్తోంది. వీరిద్దరిలోనూ ఓటింగ్ లో సన్నీకి కొంత ఎడ్జ్ ఉందని టాక్. అయితే మొదటి నుంచి గేమ్ సరిగా ఆడకున్నా షణ్ముక్ ని వెనకేసుకుంటూ వస్తున్నారు నాగార్జున, బిగ్ బాస్. దాంతో అతనికే టైటిల్ ఫిక్సింగ్ అయిఉంటుందనే వారు కూడా లేక పోలేదు. ఏది ఏమైనా మరి కొద్ది గంటల్లో ఈ సస్సెన్స్ కి తెరపడనుంది. సీజన్ 5 విజేతగా ఎవరు ఎవరి చేతినుంచి ట్రోఫీని అందుకుంటారో చూడాలి.
