సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’ . ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వంలో, స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై, రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న విడుదల కానుంది.ఈ మూవీలో బ్రహ్మానందం కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవితంలో తండ్రికొడుకులైన ఈ ఇద్దరు ఈ సినిమాలో తాత మనవళ్లు గా కనిపించనున్నారు.
ఇక ప్రమోషన్ లో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు మూవీ టీం. ఇందులో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ తన కొడుకు గౌతమ్ గురించి వైరల్ కామెంట్స్ చేశాడు.. ‘ దర్శకుడు శేఖర్ కమ్ముల మూవీస్ లో ‘గోదావరి’ మూవీ చూసే ఉంటారు. సుమంత్ కంటే ముందు ఈ మూవీ లో హీరోగా గౌతమ్ కి అనుకున్నాడు శేఖర్. అయితే కథ మొత్తం విని వచ్చి లేడి ఓరియెంటెడ్ స్టోరీ అది , అందులో ఒక యాక్షన్ లేదు ఏం లేదు అని చెప్పాడు గౌతమ్. ఈ విషయం నేను ఎవరికైన చెప్పుకుందాం అంటే బ్రహ్మానందం కొడుకు ఎంత బలుపు శేఖర్ కమ్ముల పిలిచి మరి క్యారెక్టర్ ఇస్తే వద్దంటున్నాడని అనుకుంటారని చెప్పాలి. నేను కూడా వాని ఏం అనలేదు ఎందుకంటే జనరేషన్ గ్యాప్. ఇప్పటి వారు కొత్తదనం కోరుకుంటారు. నే రీసెంట్ గా కనిపించిన సినిమాలు చూసిన ప్రేక్షకులు నా నుండి కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. నాకు ఆఫర్ లు వస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు సొషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.