Brahmanandam : ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ME and मैं పేరుతో రాసిన ఆయన ఆత్మకథ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. నేను ఈ పుస్తకం రాయడానికి ఎంతో మంది స్ఫూర్తిగా ఉన్నారు. ఎందుకు రాశాను అంటే అదో పెద్ద చర్చ. ఎంతో మంది మహానుభావులు చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగారు. నేను కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. లెక్చరర్ గా పనిచేశాను. నటనమీద ఆసక్తితోనే సినిమాల్లోకి వచ్చాను. ఇప్పటికీ 1200 సినిమాలు చేశానంటే అది ఆ నటరాజ ఆశీర్వాదంతో పాటు ప్రేక్షకుల ప్రేమనే కారణం.
Read Also : Venkaiah Naidu : బ్రహ్మానందం కనిపిస్తేనే నవ్వొస్తుంది.. ఆత్మకథ పుస్తకం ఆవిష్కరించిన వెంకయ్య..
నా జీవితం గురించి మాత్రమే పుస్తకంలో రాశాను. నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. నేను రాజకీయాల్లోకి రాను. సినిమాలకే నా జీవితం అంకితం. నా పదవికి రిటైర్మెంట్ ఇవ్వచ్చేమో గానీ.. నా పెదవికి ఇవ్వలేదు. బురద నుంచి కమలం పుడుతుంది. కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది. ఈ విషయంలో వెంకయ్య నాయుడు నాకు ఎంతో స్ఫూర్తిగా ఉంటారు. ఈ మధ్య గ్లోబల్ కమెడియన్ అవార్డ్ ఇచ్చారు. నన్ను కేవలం సినిమాకే పరిమితం కాకుండా మీమ్స్ బాయ్ గా చేశారు. ఏం చేసినా సరే పదిమందిని నవ్వించడమే నా ప్రధాన ఉద్దేశం అంటూ తెలిపారు బ్రహ్మానందం.
Read Also : Rashmika : విజయ్ తో ఎంగేజ్ మెంట్.. తానే అందరికీ చెప్తానన్న రష్మిక..
