Brahmaji: టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభిమానులతో, తోటి నటులతో ఎంతో చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా మరోసారి బ్రహ్మాజీ తన చమత్కారాన్ని చూపించాడు. ట్విట్టర్ లో తాజాగా బ్రహ్మాజీ ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో తలపైకెత్తి చూస్తూ కనిపించాడు. దానికి క్యాప్షన్ గా ఏం జరుగుతోంది అని రాసుకొచ్చాడు. ఇక ఈ ఫోటోపై ఒక నెటిజన్ స్పందిస్తూ ఏం లేదు అంకుల్ అంటూ కామెంట్ పెట్టాడు. ఇక అంకుల్ అన్నందుకు హర్ట్ అయిన బ్రహ్మాజీ “అంకుల్ ఏంటి రా అంకులు.. కేసు వేస్తా.. ఏజ్, బాడీ, షేమింగా” అంటూ విరుచుకుపడ్డాడు. అయితే అంత కంగారుపాడిల్సిన అవసరం లేదు.
బ్రహ్మాజీ జోక్ గా చెప్పినట్లు పక్కనే ఉన్న నవ్వు ఎమోజి చూస్తే తెలుస్తోంది. ఇటీవల అనసూయ ‘ఆంటీ’అనే పదంతో ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దానికి కౌంటర్ గా కాకపోయిన ట్రెండ్ లో ఉన్న టాపిక్ ను లాగి బ్రహ్మాజీ కొద్దిగా సెటైర్ వేసినట్లే కనిపిస్తోంది. ఇక దీంతో నెటిజన్స్ బ్రహ్మాజీకి తమదైన శైలిలో రిప్లైలు ఇస్తున్నారు. అంకుల్ మీరు తగ్గొద్దు.. ఆంటీ అంటే కేసు వేస్తే అంకుల్ అంటే కేసు వేయకూడదా..? అని కొందరు.. మరికొందరు అంకుల్ కాదు ఈ మధ్యనే తాత అయ్యాడు.. తాత అని పిలవండి అని.. ఇంకొందరు మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా, ఫలానా ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ గారు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Uncle entra.. uncle u.. case vestha.. age.. body.. shaming aa.. 😜 https://t.co/9fbRbXirbJ
— Brahmaji (@actorbrahmaji) August 30, 2022
What’s happening..? pic.twitter.com/ggnrkyCS8G
— Brahmaji (@actorbrahmaji) August 30, 2022