Site icon NTV Telugu

Brad Pitt: త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న హాలీవుడ్ ​స్టార్ హీరో

Hollywood Actor Brad Pitt

Hollywood Actor Brad Pitt

ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ సంచలన ప్రకటన చేశారు. తన నట ప్రస్థానంలో చివరి దశలో ఉన్నట్లు త్వరలో పూర్తిస్థాయిలో సినిమాలకు దూరం కానున్నట్లు ప్రకటించారు. త్వరలో తాను నటనకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు బ్రాడ్ పిట్. మరో 3 లేదా 6 నెలల్లో తన యాక్టింగ్ కెరీర్‌కు ఎండ్ కార్డు వేస్తానని ఆయన వెల్లడించారు. ఈ ప్రకటనతో బ్రాడ్ పిట్ అభిమానులు నిరాశకు లోనయ్యారు.

‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ సినిమాకు ఇటీవల ఆయన ఆస్కార్​ అవార్డును అందుకున్నారు. ఆయన నటించిన బుల్లెట్ ట్రైన్ సినిమా ఆగస్ట్ 5న విడుదల కానుంది. బ్రాడ్ పిట్ తన మాజీ భార్య ఏంజెలినా జోలీతో న్యాయ వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇద్దరి భాగస్వామ్యంలో ఉన్న వైన్ వ్యాపారంలో జోలీ.. తన వాటాలను విక్రయించారు. ఈ క్రమంలో బ్రాడ్ పిట్ కోర్టులో పిటిషన్ వేశారు.

Exit mobile version