NTV Telugu Site icon

Boys Hostel Movie: బాయ్స్ హాస్టల్ 1+1 ఆఫర్.. ఒక టికెట్ కొని ఇద్దరు సినిమా చూడచ్చు!

Boys Hostel Movie

Boys Hostel Movie

Boys Hostel Movie 1+1 offer: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరేను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో గ్రాండ్ గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. నితిన్ కృష్ణమూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు. బాయ్స్ హాస్టల్ ఆగస్టు 26న తెలుగులో విడుదలైన క్రమంలో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఎక్కడున్నా ఆదరించడం తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకత అని అని అది ‘హాస్టల్ బాయ్స్’ సినిమాతో మరోసారి రుజువయిందని అన్నారు.

Yarlagadda Supriya: వాళ్లకి గీర ఎక్కువ.. యూట్యూబర్ వివాదంపై సుప్రియ సంచలన వ్యాఖ్యలు

ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిన సినిమా బాయ్స్ హాస్టల్ అని థియేటర్ లో ప్రేక్షకుల నవ్వులు చూస్తున్నపుడు వచ్చే తృప్తి వేరుగా ఉందని అన్నారు. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మాకు కూడా కొత్తకొత్తగా ఆలోచనలు పుడతాయని, సినిమాని థియేటర్ లో చూడండని అన్నారు. అలా ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని నవ్విస్తుందని పేర్కొన్న ఆమె ఇది మా గ్యారెంటీ’’ అని అన్నారు. నిర్మాత శరత్ మాట్లాడుతూ సినిమా చూసిన అందరికీ విపరీతంగా నచ్చుతుందని, కొత్త ప్రయత్నం చేస్తే అభినందించే ప్రేక్షకులు ఉన్నారని మరోసారి రుజువయిందని అన్నారు. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని పేర్కొన్న ఆయన దీనికి యూత్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. మంత్ ఎండ్ కావడంతో స్టూడెంట్స్ కి పాకెట్ మనీ ఇష్యూ వస్తుంది అందుకే వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన థియేటర్స్ జాబితా రిలీజ్ చేస్తామని అన్నారు. సినిమా చాలా బాగుంది, తప్పకుండా చూడండి బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు.