Site icon NTV Telugu

Boyapati Srinu : మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లానింగ్… తెలుగు హీరోతో కాదు !!

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘ఈటీ’ ఈ నెల 11న తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ET (ఎథర్క్కుం తునింధవన్)తో సూర్య థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఇందులో సూర్యకు జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు సూర్య. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా గత రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘ఈటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బోయపాటి శ్రీను ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

Read Also : Pawan Kalyan: అన్నా నీకు దండం.. ఆ పని మాత్రం చేయకు

ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ.. “సూర్య, నేనూ ఓ తప్పకుండా చేస్తాము. నేను ఎప్పుడు అనేది చెప్పలేను కానీ మేము ఖచ్చితంగా ఓ సినిమా చేస్తాము” అని అన్నారు. తెలుగు ప్రేక్షకులు సూర్యను తమిళ హీరోగా కాకుండా తమలో ఒకరిగా చూస్తున్నారని బోయపాటి అన్నారు. బోయపాటి చాలా కాలంగా సూర్యతో ఒక ప్రాజెక్ట్ మెటీరియలైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇద్దరూ బిజీగా ఉండడం వల్ల అది కుదరలేదు, మరి ఇప్పటికైనా వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=DbGgf63vTek
Exit mobile version