Site icon NTV Telugu

Boyapati Rapo: ఇదెక్కడి మాస్ పోస్టర్ రా మావా…

Boyapati Rapo

Boyapati Rapo

ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా #BoyapatiRapo అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. రేర్ గా సెట్ అయ్యే మాస్ క్లాస్ కాంబినేషన్ లో సినిమా మాస్ గా ఉంటుందా? క్లాస్ గా ఉంటుందా? అనే డౌట్ అందరిలోనూ ఉండేది. అసలు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు పక్కాగా బోయపాటి స్టైల్ లో ఊరమాస్ గానే ఈ సినిమా ఉంటుంది అని కన్ఫామ్ చేస్తూ ఫస్ట్ లుక్ బయటకి వచ్చేసింది. బేస్ బాల్ బాట్ తో రామ్ పోతినేని నెవర్ బిఫోర్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. సిలం అండ్ క్యూట్ గా ఉండే రామ్, పూర్తిగా బోయపాటి హీరోలా మారిపోయి గడ్డం పెంచి మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇలాంటి ఒక లుక్ ని రామ్ పోతినేని చూస్తాం అని ఫాన్స్ ఏ రోజు అనుకోని ఉండరు.

Read Also: Vyjayanthi Movies: ఎన్టీఆర్ నుంచి నాని వరకూ అందరినీ వాడేస్తున్నారు…

ఇస్మార్ట్ శంకర్ లో తన రెగ్యులర్ రూట్ నుంచి బయటకి వచ్చి రామ్ పోతినేని మాస్ గా కనిపించినా మరీ ఇంత ఊరమాస్ గా కనిపించలేదు. మే 15న రామ్ పోతినేని బర్త్ డే కావడంతో మేకర్స్, టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. #BoyapatiRapo ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ థండర్ ని మే 15న ఉదయం 11:25 రిలీజ్ చెయ్యనున్నారు. పోస్టర్ తోనే షాక్ ఇచ్చిన బోయపాటి శ్రీను అండ్ రామ్ పోతినేని… ఇక ఫర్ట్ థండర్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ ఫస్ట్ థండర్ కి తమన్ ఇవ్వబోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి ఎందుకంటే బోయపాటి డైరెక్ట్ చేసిన అఖండ సినిమాకి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి పూనకలు తెప్పించాడు. అమరి అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ సినిమాకి ఎలాంటి మ్యాజిక్ చేశాడు అనేది టీజర్ తోనే తెలిసిపోనుంది.

Exit mobile version