NTV Telugu Site icon

BOO: థ్రిల్‌ అండ్‌ చిల్‌ అంటున్న టాప్‌స్టార్స్‌!

V (1)

V (1)

Vishwak Sen: మల్టీస్టారర్ మూవీస్ ను థియేటర్ లో చూస్తే కలిగే కిక్కే వేరు. బట్ అలాంటి కిక్ నే జియో సినిమా ఫ్రీగా అందించడానికి రెడీ అయిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు…. బోలెడంత మంది స్టార్స్ నటించిన సినిమా అది. అంతేకాదు… అందులో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్ వంటి క్రేజీ ఆర్టిస్టులూ కనిపించబోతున్నారు. వీళ్ళంతా కలిసి మీకు వినోదం అందిస్తారనో, గ్లామర్ ట్రీట్ ఇస్తారనో అనుకుంటే పొరపాటు పడినట్టే! అక్షరాల మిమ్మల్ని వీళ్ళు భయపెట్టబోతున్నారు. మేఘా ఆకాశ్ అయితే ఓ అడుగు ముందుకేసి… ఈసారి మీకు ఎక్కిళ్ళు వస్తే నీళ్ళ కోసం వెళ్ళకండి… మీ పరిసరాల్లో దెయ్యం ఉందేమో చూసుకోండి అని హెచ్చరిస్తోంది.

ఇంతకూ విషయం ఏమంటే… ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ‘భూ’ అనే హారర్ అండ్ థ్రిల్లర్ మూవీని జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ నెల 27 స్ట్రీమింగ్ చేయబోతోంది. శర్వంత్ రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్ బ్యానర్స్ మీద జవ్వాజి రామాంజనేయులు, యం. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ‘భూ’ సినిమా ఆద్యంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా ఉంటుందని, విజయ్ దీనిని చాలా బాగా హ్యాండిల్ చేశాడని వారు చెబుతున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు.