Site icon NTV Telugu

ఇంట్రెస్టింగ్ గా ‘బొమ్మల కొలువు’ ట్రైలర్‌

సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బొమ్మల కొలువు’.. హృషికేశ్‌, సుబ్బు, ప్రియాంక శర్మ, మాళవిక ప్రధాన పాత్రల్లో నటించారు. పృథ్వీ క్రియేషన్స్‌ పతాకంపై ఎ.వి.ఆర్‌. స్వామి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘అమ్మాయిలను వరుసగా కిడ్నాప్ చేయడం.. ఆ తరువాత వాళ్లను హత్య చేసి.. శవాలను రహస్యంగా పారేయడం ట్రైలర్ లో కనిపించిన కథ. అయితే ఆ అదృశ్యమైన యువతులకి సంబంధించిన బంధువులు పోలీస్ స్టేషన్ నుంచి ఫిర్యాదులను వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ప్రవీణ్‌ లక్కరాజు అందించిన నేపథ్య సంగీతం బాగుంది. మరి ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

Exit mobile version