Site icon NTV Telugu

Singham Again: గేమ్ చేంజర్ తో పోటీ పడనున్న బాలీవుడ్ సూపర్ స్టార్..!

Singham

Singham

Ajay Devgn’s Singham Again: బాలీవుడ్ స్టార్స్ అజయ్‌ దేవగన్, కరీనా కపూర్‌ జంటగా అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్, అర్జున్‌ కపూర్, టైగర్‌ ష్రాఫ్, దీపికా పదుకోన్‌ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సింగమ్‌ ఎగైన్‌’. ‘సింగమ్‌ ఫ్రాంచైజీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్‌ శెట్టి ‘సింగమ్‌ ఎగైన్‌’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈ మూవీని జులై 12 రిలీజ్ చేయాలనున్న షూటింగ్ లేట్ కావడంతో ఆగష్టు 15కి పోస్టుపోన్ చేసారు. కానీ ఇప్పుడు మూవీ మరొకసారి విడుదల తేదీని మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన ఓ మీడియా ఈవెంట్‌లో అజయ్ దేవగన్ ‘సింగం ఎగైన్’ విడుదల ఆలస్యం కావడానికి గల కారణాన్ని వెల్లడించారు. “ఆగస్టు 15 నాటికి సినిమా రెడీ అవుతుందన్న నమ్మకం మాకు లేదు.

Also Read; Honeymoon Express : గ్రాండ్ గా “హనీమూన్ ఎక్స్ ప్రెస్” ప్రీ రిలీజ్ ఈవెంట్.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

కాబట్టి తొందరపడటం లేదు అని ప్రస్తుతం ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అందుకుగాను ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు మూవీ టీమ్. కానీ దక్షిణాది నుండి దీపావళికి అజిత్ కుమార్ “విడాముయార్చి”, రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” కూడా దీపావళికే వస్తున్నాయి. దీనితో దీపావళికి గట్టి పోటీ నేలకుంది. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించిన స్ట్రీ సీక్వెల్ తెరకెక్కిన “స్ట్రీ 2” కూడా డిసెంబర్ నెలలోనే రిలీజ్ కానుంది. ఇక చూడాలి సింగం అనుకున్న డేట్ కి వస్తుందో లేక మరొకసారి మల్లి వాయిదా పడుతుందో వచ్చి చుడాలిసిందే…

Exit mobile version