Site icon NTV Telugu

పాము కాటుతో ఆసుపత్రి పాలైన సల్లూ భాయ్

Salman-Khan

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాము కాటుతో ఆసుపత్రి పాలయ్యారు. ఈరోజు తెల్లవారుజామున సల్మాన్ ఖాన్ తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో విషం లేని పాము కాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కమోతేలోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు సల్మాన్ఈ. ఆయనను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించాక ఈ రోజు ఉదయం 9 గంటలకు డిశ్చార్జి చేశారు. పాము సల్మాన్ చేతిపై కాటేసినట్టు సమాచారం. మొత్తానికి తమ అభిమాన నటుడు పాము కాటు నుంచి క్షేమంగా బయట పడడంతో సల్లూ భాయ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

https://ntvtelugu.com/valimai-to-release-in-telugu-as-balam/

కాగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 15’ ఈరోజు రాత్రి ప్రసారం కానుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ‘ఆర్ఆర్ఆర్’ త్రయంతో ఆయన చేసిన సందడికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘నాటు నాటు’ సాంగ్ కు చరణ్, తారక్ ల దగ్గర స్టెప్ నేర్చుకుని మరీ వేశాడు సల్మాన్. అలాగే ఇదే వేదికపై సల్మాన్ ను రాజమౌళి డైరెక్ట్ చేశారు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ పుట్టినరోజు ఈ నెల 27న కావడంతో ‘బిగ్ బాస్ 15’ వేదికపైనే ‘ఆర్ఆర్ఆర్’టీంతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు సల్మాన్. ఈ ఎపిసోడ్ గురించి బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులతో పాటు సౌత్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ముంబైలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా సల్మాన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version