NTV Telugu Site icon

Oscars 95: ఇండియా నుంచి ఆ సెలబ్రిటీకి మాత్రమే దక్కిన అవకాశం…

Oscars 95

Oscars 95

ఫిల్మ్ మేకర్స్ కి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆస్కార్ అవార్డ్స్… ప్రతి ఏడాది రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ కి, ఆ మూవీస్ కి వర్క్ చేసిన టెక్నిషియన్స్ కి, యాక్ట్ చేసిన కాస్ట్ కి ఆస్కార్ అవార్డ్స్ ని ఇస్తారు. మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ టాప్ మోస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ గా పేరు తెచ్చుకున్న ఆస్కార్స్ ఈ ఏడాది మార్చ్ 12న ప్రకటించనున్నారు. ముందు కన్నా ఎక్కువగా ఈసారి ఆస్కార్స్ అవార్డ్స్ పై ఇండియన్స్ ఎక్కువగా దృష్టి పెట్టారు, ఇందుకు కారణం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేసులో ఉండడమే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ రేసులో ఉంది. జక్కన డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎపిక్ డ్రామా ఆస్కార్ ని ఇండియాకి తెస్తుంది అనే నమ్మకంతో ఇండియన్ సినీ అభిమానులు ఉన్నారు. చరణ్, ఎన్టీఆర్, కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్, రాజమౌళి, కీరవాణిలు ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ ని గ్రేస్ చేస్తున్నారు. వీరితో పాటు మరో ఇండియన్ సెలబ్రిటీ కూడా ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొనబోతుంది.

లాస్ ఏంజిల్స్ లో జరగనున్న ఈ అవార్డ్స్ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోణే ‘ప్రెజెంటర్’గా అటెండ్ అవుతుంది. ఈ విషయాన్ని ‘అకాడెమీ’ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. విన్నర్స్ కి ఆస్కార్ అవార్డ్ ని అందించబోయే 16 మంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ లో దీపిక పదుకోణేకి చోటు దక్కింది. డ్వైన్ జాన్సన్, మైఖేల్ బీ జోర్డన్, రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, జోనాథన్ మేజర్స్, అరియానా డీబోస్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ తో పాటు దీపిక పదుకోణే పేరు కూడా ఆస్కార్ అవార్డ్స్ ప్రెజెంటర్స్ లిస్టులో ఉండడం గొప్ప విషయం. నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవ్వడం, చరణ్-ఎన్టీఆర్ లు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, దీపిక పదుకోణే ప్రెజెంటర్ గా ఎంపిక అవ్వడం లాంటి విషయాలని చూస్తుంటే ఈ ఇయర్ ఆస్కార్స్ ఇండియాకి చాలా స్పెషల్ గా మారినట్లు అనిపిస్తుంది. మరి ఇదే జోష్ లో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుని గెలిచి, ఆ ప్రెస్టీజియస్ అవార్డుని ఇండియాకి తీసుకోని వస్తే… అది భారతీయ సినీ చరిత్రలో గోల్డెన్ మూమెంట్ గా నిలిచిపోతుంది.

Show comments