NTV Telugu Site icon

Bollywood: మా సినిమాలని బిస్కెట్ చెయ్యడంలో మీ తర్వాతే ఎవరైనా

Ala Vaikuntapuramulo

Ala Vaikuntapuramulo

ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో రీమేక్ చెయ్యాలి అంటే చాలా కష్టపడాలి. మ్యాజిక్ మిస్ అయితే ఒరిజినల్ సినిమాని చెడగొట్టారు అంటారు, ఒరిజినల్ లానే తీస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ అంటారు. ఈ రెండు విషయాలని బాలన్స్ చెయ్యడం కత్తి మీద సాము లాంటిదే. అయితే పలానా హీరో కోసమే రాసిన కథ అనే లాంటి సినిమాలని రీమేక్ చెయ్యకపోవడమే బెటర్ డెసిషన్. ఎందుకంటే ఆ కథ, ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు రాసి ఉంటారు, అతన్ని మైండ్ లో పెట్టుకోని డిజైన్ చేసి ఉంటారు. అందుకే అలాంటి సినిమాలని రీమేక్ చెయ్యకూడదు. అసురన్, రఘువరన్ బీటెక్, లూసిఫర్, జెర్సీ, ఖైదీ లాంటి సినిమాలు ఈ కోవలోకి వచ్చేవే. ఈ సినిమాలని పూర్తిగా ఆ హీరోలని మైండ్ లో పెట్టుకోని చేసిన సినిమాలు అందుకే వీటిని ఎవరైనా రీమేక్ చేస్తే ఒరిజినల్ కి కనెక్ట్ అయినంతగా రీమేక్ కి కనెక్ట్ అవ్వలేరు. ఇలాంటి సినిమానే అల వైకుంఠపురములో కూడా. అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యింది.

అల్లు అర్జున్ లోని ఈజ్ ని దృష్టిలో పెట్టుకోని, త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్ తో ఊహించని ట్విస్టులు పెట్టకుండా స్ట్రెయిట్ గా చెప్పిన ఒక కథ ‘అల వైకుంఠపురములో’. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది, ఇందులో ‘బంటు’గా బన్నీ చేసిన పెర్ఫార్మెన్స్ ని అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇదే మూవీని హిందీలో ‘షెహజాదా’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. కార్తీక్ ఆర్యన్ బాగానే ఉన్నాడు కానీ ఇతను మన అల వైకుంఠపురములో సినిమాలోని బన్నీ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు అనే విషయం గుర్తు రాగానే నెగటివ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అల వైకుంఠపురములో సినిమాలో ఉండే మ్యాజిక్, షెహజాదా ట్రైలర్ లో కనిపించలేదు. సీన్స్ ని మ్యాచ్ చెయ్యడానికి ట్రై చేశారు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాస్త ఓవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యింది. కామెడి కాస్త క్రింగే కామెడి అయ్యింది. ఎందుకో షెహజాదా ట్రైలర్ చూసిన తర్వాత బాలీవుడ్ వాళ్లు మన సినిమాలని రీమేక్ చెయ్యడం ఆపేస్తే బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది. కింద రెండు ట్రైలర్స్ అటాచ్ చేసాం, ఆ రెండూ చూస్తే డిఫరెన్స్ మీకే అర్ధం అయిపోతుంది.

 

అల వైకుంఠపురములో