Site icon NTV Telugu

46 ఏళ్లకు తల్లి అయిన స్టార్ హీరోయిన్!

preity zinta

preity zinta

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతీజింటా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె కవలలకు జన్నిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. 2016 లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను వివాహమాడిన ఈ బ్యూటీ ఆ తరువాత సినిమాలకు స్వస్తి చెప్పింది. ఐదేళ్ల తరువాత సరోగసీ(అద్దె గర్భం) ద్వారా ఈ జంట తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ” అందరికి నమస్కారం.. ఈరోజు మేము జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్న రోజు.. జీన్, నేను కవలలకు తల్లిదండ్రులయ్యాము.. ప్రస్తుతం మా హృదయాలు కృతజ్ఞత, ప్రేమతో నిండిపోయాయి. సరోగసి ద్వారా కవలలను మా కుటుంబంలోకి స్వాగతించాం. వారి పేర్లు జై జింటా, గియా జింటా నిర్ణయించాం’ అంటూ ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version