The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆలియాభట్ నటించిన ఆల్ఫా మొన్నటి వరకు ఎప్పుడొస్తుందో సరైన క్లారిటీ లేదు. గత ఏడాది క్రిస్మస్కు రావాల్సిన ఈ స్పై థ్రిల్లర్.. ఈ ఏడాది ఏప్రిల్‌కు, ఆ తర్వాత జులై10కి వాయిదా పడింది. కానీ రీసెంట్లీ టీజర్ వదిలి జులై 3న వస్తున్నట్లు ప్రకటించింది యశ్ రాజ్ ఫిల్మ్స్. భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ ధమాల్4 కూడా పలుమార్లు వాయిదా పడి.. చివరకు జులై 17న డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ సడెన్లీ యూటర్న్ తీసుకుని జులై 10నే వచ్చేస్తోంది. ఆల్ఫా, ధమాల్4 మూవీస్ వన్ వీక్ బిఫోర్ రావడానికి కారణమైంది ఓ భయం. అదీ సృష్టించింది ఓ హాలీవుడ్ డైరెక్టర్.
హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నొలన్ నుండి రాబోతున్న హై ఆక్టేన్ ఫిల్మ్ ది ఒడిస్సీ. ఒపెన్ హైమర్ తర్వాత దర్శకుడి నుండి వస్తున్న సినిమా కావడంతో హై ఎక్స్ పర్టేషన్స్ మొదలయ్యాయి. జులై 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ గ్రీక్ మైథలాజికల్ ఫిల్మ్. ఏడాది క్రితమే అమెరికాలో అడ్వాన్స్ డ్ బుకింగ్స్ హౌస్ ఫుల్ అయిపోయాంటే ఈ సినిమాకు ఎంత హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్లోనే కాదు ఇండియాలోనూ ఈ సినిమా విపరీతమైన బజ్ నడుస్తోంది. ఇప్పటికే ది ఒడిస్సీ అడ్వాన్స్డ్ బుకింగ్ సేల్స్ స్టార్ట్ కాగా.. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. మన సినిమాలకు వెయ్యి రూపాయలు టికెట్ ప్రైజ్ నిర్ణయిస్తే గగ్గోలు పెట్టే ఆడియన్స్.. ఒడిస్సీ టికెట్స్ 3 వేలు చెబుతున్నా కొనేస్తున్నారంటే.. ఈ మూవీపై, దర్శకుడి గత సినిమాలకు ఉన్న మాస్ క్రేజే రీజన్. ఇప్పటికే ఇండియాలో రికార్డ్ స్థాయిలో రూ. 1.5 లక్షలకు పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఈ మేనియా చూసే బాలీవుడ్ ఫిల్మ్స్ మెల్లిగా దుకాణం సర్దేసుకుని ముందుకొచ్చేశాయి.
Also Read
- Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్‌గా నివిన్ పౌలి.. 'బెత్లేహెమ్ కుటుంబ యూనిట్' బ్లాక్ బస్టర్
- Irumudi Review: ఇరుముడి రివ్యూ
- Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
- OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్‌గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
-
Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!