Vidya Sinha: దేశమంతా ఆగస్టు 15 వేడుకులను ఘనంగా జరుపుకొంటుంది. సినీ, రాజకీయ ప్రముఖులు తమ దేశభక్తిని చాటుతూ అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ఈ నేపథ్యంలోనే చిత్ర పరిశ్రమలో ఒక చేదు సంఘటనను కూడా గుర్తుచేసుకుంటున్నారు. అదేంటంటే.. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి విద్యా సిన్హా ఆగస్టు 15 న కన్నుమూశారు. ఇందులో విశేషం ఏముంది అంటే.. ఆమె 1947.. అనగా స్వాతంత్య్రం వచ్చిన ఏడాది జన్మించారు.. విశేషమో, యాదృచ్ఛికమో తెలియదు కానీ మూడేళ్ళ క్రితం అదే ఇండిపెండెన్స్ డే రోజున మృతి చెందారు. దీంతో ప్రతి ఏడాది ఇదే రోజు ఆమె గురించి చాలామంది తలుచుకుంటూ ఉంటారు.
‘రజనీగంధ’, ‘చోటీ సీ బాత్’, ‘పతి పత్నీ ఔర్ వో’ లాంటి చిత్రాలలో నటించి మెప్పించ విద్యా 71 ఏళ్ల వయస్సులో గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆమె మరణించారు.. ఆరోజు ఆగస్టు 15 వేడుకలు జరుగుతుండడం విశేషం. దీంతో ఈమె పుట్టుక, చావులకు, దేశ స్వాతంత్య్రానికి ఏదో సంబంధం ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు. 18 ఏళ్లకే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన విద్యా హీరోయిన్ గా మంచి సినిమాల్లో నటించి సల్మాన్ ఖాన్ నటించిన బాడీ గార్డ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. ఇక నేడు ఈమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
