ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. ప్రశాంత్ నీల్ తో కలిసి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సలార్ సినిమాతో మరో నాలుగు రోజుల్లో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు ప్రభాస్. సలార్ ప్రమోషన్స్ విషయంలో ఇప్పటికే రాజమౌళితో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్. నెక్స్ట్ సోలో ఇంటర్వ్యూ, పృథ్వీరాజ్ తో ఒక ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నాడని సమాచారం. సలార్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం కనిపించట్లేదు. రిలీజ్ ట్రైలర్, మరో సాంగ్ రిలీజ్ తోనే ప్రమోషన్స్ ని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. సలార్ రిలీజ్ డేట్ బిజీలో ఉన్న ప్రభాస్ కోసం KGF విలన్ ని రంగంలోకి దించాడు మారుతీ. ప్రభాస్-మారుతీ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం సంజయ్ దత్ ని తీసుకున్నారు.
ఇటీవలే మారుతీ ముంబై వెళ్లి లుక్ టెస్ట్ చేసి కూడా వచ్చాడు. లేటెస్ట్ గా సంజయ్ దత్… ప్రభాస్-మారుతీ సినిమా షూటింగ్ కోసం నిన్న హైదరాబాద్ చేరుకున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ముందుగా షూటింగ్ చేసి, ఆ తర్వాత ఆరామ్ ఘర్ లో వేసిన సెట్ లో షూటింగ్ చేయనున్నారు. ప్రభాస్ సలార్ ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యాక సంజయ్ దత్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. సంజయ్ దత్ జాయిన్ అవ్వడం గురించి మారుతీ నుంచి కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న మారుతీ కనీసం న్యూ ఇయర్ కైనా ఈ ప్రాజెక్ట్ అప్డేట్ ఇస్తాడేమో చూడాలి.
