NTV Telugu Site icon

Shera: 1.4 కోట్లతో రేంజ్ రోవర్ కారు కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్… జీతం ఎంతో తెలుసా?

Shera

Shera

Shera Salary: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా 1.4 కోట్ల విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. షేరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కారు ఫోటోను షేర్ చేశారు. 1995 నుండి, నటుడు సల్మాన్ ఖాన్ అంగరక్షకుడు, షేరా ఎల్లప్పుడూ సల్మాన్ ఖాన్‌తో ఉంటాడు. అంతర్జాతీయ పర్యటనలలో సైతం సల్మాన్ ఖాన్‌ను అంటి పెట్టుకునే ఉంటాడు. ఇటీవల, షేరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను కొనుగోలు చేసిన ఈ బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ కారుతో పోజులివ్వగా, ఆ ఫోటో వైరల్‌గా మారింది. సల్మాన్ ఖాన్ నమ్మకమైన బాడీగార్డ్ గా 29 సంవత్సరాలుగా షేరా పని చేస్తున్నాడు. సర్వశక్తిమంతుడి ఆశీర్వాదంతో మేము కొత్త సభ్యుడిని మా ఇంటికి స్వాగతిస్తున్నాము, ”అని ఆయన రాసుకొచ్చారు. ఇక ఈ లగ్జరీ కారు అంచనా ధర రూ. 1.4 కోట్లు.

Shakeela: హోటల్‌లో తెలుగు హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. మధ్యలో షకీలా ఎంట్రీ!

ఈ అంగరక్షకుడు షేరా అసలు పేరు గుర్మిత్ సింగ్ జాలీ, అతను 1995 నుండి సల్మాన్ ఖాన్ అంగరక్షకుడు. ఆయన టైగర్ సెక్యూరిటీ అనే సెక్యూరిటీ సంస్థను కలిగి ఉన్నాడు. 2017లో, గ్రామీ అవార్డు గెలుచుకున్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ముంబైకి వచ్చినప్పుడు, ఈ షేరా సంస్థ అతనికి భద్రత కల్పించింది. ఇక ముంబైలోని అంధేరిలో 19 మే 1969న జన్మించిన షేరా 1987లో ముంబై జూనియర్ బాడీ బిల్డింగ్ అవార్డును గెలుచుకుని 1988లో మహారాష్ట్ర జూనియర్ అవార్డును గెలుచుకుని సల్మాన్ ఖాన్ కి సన్నిహితుడుగా మారాడు. ఇక 2019లో షేరా శివసేనలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. చాలా ఇంటర్వ్యూలలో సల్మాన్‌తో తన సుదీర్ఘ అనుబంధం గురించి మాట్లాడుతూ, షేరా నాకు శ్వాస ఉన్నంత వరకు తన సోదరుడు సల్మాన్‌తో ఉంటానని చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ జీతం గురించి చాలా మందికి ఆసక్తి ఉండవచ్చు. సల్మాన్‌ఖాన్‌తో ఉన్న చిరకాల స్నేహం కారణంగా షేరా జీతం ఇప్పుడు కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలను మించిపోయింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం, షేరా నెలకు రూ. 15 లక్షల జీతం, రూ. 2 కోట్లకు పైగా వార్షిక వేతనం పొందుతున్నారట.

Show comments