NTV Telugu Site icon

Nithesh Pandey: కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి

Nitesh Pandey

Nitesh Pandey

హిందీ టెలివిజన్ పరిశ్రమకు ఇది బ్లాక్ డే. కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు బెస్ట్ యాక్టర్స్ ని ఇండస్ట్రీ కోల్పోయింది. ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మరియు వైభవి ఉపాధ్యాయల మరణాలు మర్చిపోయే లోపే అనుపమ నటుడు ‘నితీష్ పాండే’ కూడా ప్రాణాలు కోల్పోయాడనే వార్త బాలీవుడ్ వర్గాలని, బుల్లితెర ప్రేక్షకులని కలచివేస్తోంది. రూపాలీ గంగూలీ చేసిన హిట్ టీవీ షోలో ధీరజ్ కపూర్ పాత్ర వలన ఫేమ్ తెచ్చుకున్నాడు నితీష్ పాండే. నితేష్ 51 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. మరణించే సమయంలో ఆయన ముంబైలోని ఇగత్‌పురిలో ఉన్నారు. నితేష్ పాండే 1990లో థియేటర్‌లో నటించడం ప్రారంభించాడు. 1995లో తేజస్‌లో డిటెక్టివ్‌గా నటించాడు. నితేష్ పాండే మంజిలీన్ ఆపని ఆపని, అస్తిత్వ…ఏక్ ప్రేమ్ కహాని, సాయా, జస్టజూ మరియు దుర్గేష్ నందిని వంటి సీరియల్స్‌లో పనిచేశాడు. నితీష్ పాండే ఓం శాంతి ఓం మరియు బదాయి దో వంటి చిత్రాలలో కూడా పనిచేశాడు.

నితీష్ పాండే నటించడమే కాదు డ్రీమ్ కాజిల్ ప్రొడక్షన్స్ పేరుతో స్వతంత్ర నిర్మాణ సంస్థను కూడా నడిపాడు. ఖోస్లా కా ఘోస్లాలో నితీష్ పాండే చేసిన యాక్టింగ్ అందరితో ప్రశంశలు అందుకునేలా చేసింది. నితీష్ పాండే చివరిసారిగా అనుపమ మరియు ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారాలో కనిపించాడు. అతను గత 25 సంవత్సరాలుగా నితీష్ పాండే భారతీయ టెలివిజన్‌లో బాగా తెలిసిన ముఖం. నితేష్ ఉత్తరాఖండ్‌లోని అల్మోరా కుమావోన్‌కు చెందినవాడు, అశ్విని కల్సేకర్‌ను అయన వివాహం చేసుకున్నాడు, 2002లో ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత జస్టజూ అనే టీవీ షోలో పరిచయమైన నటి అర్పితా పాండేని నితీష్ పాండే 2003లో వివాహం చేసుకున్నాడు. నితీష్ పాండే మరణించడంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కండోలెన్సెస్ తెలుపుతున్నారు.