Site icon NTV Telugu

Blood and Chocolate : ఇంట్రెస్టింగ్ గా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ ట్రైల‌ర్

Blood And Chocolate

Blood And Chocolate

Blood and Chocolate Telugu Trailer: లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ పతాకంపై మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ గా బ్లడ్ అండ్ చాక్లెట్ చిత్రాన్ని నిర్మించారు. షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ చిత్రాలను రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన అర్జున్ దాస్ హీరోగా, దుసరా విజయన్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఎస్.ఆర్ డి.ఎస్ సంస్థ చిత్రాన్ని విడుదల చేయనున్న ఈ ఈ సినిమా ట్రైల‌ర్‌ను సోమ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఇక ఈ కార్యక్రామంలో హీరో అర్జున్ దాస్ మాట్లాడుతూ ‘‘నేషనల్ అవార్డ్ గెలుచుకున్న వసంత బాలన్‌గారితో క‌లిసి ప‌ని చేయ‌టం మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌ అని అన్నారు. తెలుగు ప్రేక్ష‌కులు న‌న్నెంత‌గానో ప్రోత్స‌హిస్తున్నారు, బ్ల‌డ్ అండ్ చాక్లెట్ సినిమా విష‌యంలోనూ మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నానని అన్నారు.

LGM Trailer: పెళ్లి కోసం సాటి మగాడి తిప్పలే ‘ఎల్‌జీఎం’.. ఆసక్తికరంగా ట్రైల‌ర్

దుస్సారా విజ‌య‌న్‌కి థాంక్స్‌ చెప్పిన ఆయన సినిమాలో వ‌ర్క్ చేసిన వ‌నితా విజ‌య్ కుమార్‌గారు స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కి థాంక్స్‌ అని అన్నారు. హీరోయిన్ దుస్సారా విజయన్ మాట్లాడుతూ ‘‘నేను తమిళంలో చేసిన సార పట్టా పరంపర సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది, త్వరలో తెలుగు నేర్చుకుని ఇక్కడ సినిమా చేస్తానని పేర్కొంది. ఇప్పుడు అర్జున్ దాస్‌తో క‌లిసి చేసిన బ్ల‌డ్ అండ్ చాక్లెట్ మూవీ త్వ‌ర‌లోనే మీ ముందుకు రానుందని పేర్కొన్న ఆమె అర్జున్ చాలా మంచి కోస్టార్ అని అన్నారు. వ‌నితా విజ‌య్ కుమార్‌గారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం హ్యాపీ అని అందుకు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌ అని అన్నారు.

Exit mobile version