Bipasha Basu: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. గతేడాది ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చిన బాలీవుడ్ జంటలు.. ఈ ఏడాది ఒకరి తరువాత ఒకరు తల్లిదండ్రులు అయ్యినట్లు చెప్పుకొచ్చి షాక్ ఇస్తున్నారు. గత వారమే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. టక్కరి దొంగ సినిమాలో మహేష్ బాబు సరసన నటించి మెప్పించిన బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు తల్లి అయ్యింది. నేటి ఉదయం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఆరేళ్ళ క్రితం నటుడు కరణ్ గ్రోవర్ ను ప్రేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ.. గత ఏడేళ్లుగా పిల్లల కోసం ఎంతో కష్టపడింది. ఇక గతేడాది చివర్లో తాను ప్రెగ్నెంట్ అని, ఐదేళ్ల నుంచి ఎదురుచూసిన క్షణం ఇదేనని చెప్పుకొచ్చి ఎమోషనల్ అయ్యింది. అప్పటి నుంచి ఈ జంట ప్రెగ్నెన్సీ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇక నేడు బిపాసా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వారి కుటుంబంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఈ విషయం తెలియడంతో అభిమానులతో పాటు ఈ జ్ఞతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
