Abhilash Reddy : ప్రాణాలకు తెగించి బైకర్ షూటింగ్.. శర్వా అయితే 23 కిలోల వెయిట్ లాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. ఇప్పటికే గ్లింప్స్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
బైకర్ ఆడియన్స్‌కు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది?
బైకర్ 100% థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. డాల్బీ విజన్‌లో కూడా షూట్ చేశాం. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా సౌండ్ డిజైన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్‌లో చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
Also Read
- Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
- Modi - Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్‌పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ - ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
- Arnold Vosloo: టాలీవుడ్లో ‘ది మమ్మీ’ విలన్ రచ్చ.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ!
- Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
ఈ కథ రాయడానికి ఇన్స్పిరేషన్?
బైక్ అనేది అందరికీ ఒక ఎమోషన్. నాకు పర్సనల్‌గా ఆ ఎమోషన్ అంటే చాలా ఇష్టం. ఇందులో రేసింగ్‌తో పాటు చాలా మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. ఫాదర్-సన్ మధ్య ఉండే ఎమోషన్ ఆడియన్స్‌కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది.
షూటింగ్‌లో మీరు ఎదుర్కొన్న చాలెంజెస్ ఏమిటి?
ఈ సినిమాలో రేసింగ్ సీక్వెన్స్‌లను రియల్ రేసర్స్‌తో షూట్ చేశాం. షూట్ చేసినప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఒక షాట్ చేసిన తర్వాత రెండు గంటలు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చేది. కేవలం యాక్షన్‌కే 60 రోజులకు పైగా పట్టింది.
ఈ సినిమా రెండు టైమ్‌లైన్స్‌లో జరుగుతుంది. 90స్‌లో టూ స్ట్రోక్ బైక్స్ ఉండేవి, అవి ఇప్పుడు లేవు. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇందులో రేసింగ్ ఇండోనేషియాలో షూట్ చేశాం. ఆ బైక్స్ అన్నీ మళ్లీ ఇండియాకు తీసుకురావడం కూడా చాలా పెద్ద ప్రాసెస్. అలాగే ఈ సినిమా కోసం న్యూజీలాండ్, ఆస్త్రేలియా నుంచి రేసర్స్ ని రప్పించాము.
ఇండియాలో ఈ స్పోర్ట్స్ ఉందా?
ఉంది. కానీ రావాల్సిన పాపుపరిటీ రాలేదు. ఇందులో రాజశేఖర్ గారి క్యారెక్టర్‌తో ఇదే అంశాన్ని ప్రెజెంట్ చేస్తున్నాం. ఇండియాలో శ్యామ్ కొఠారి అనే వెటరన్ రేసర్ ఉన్నారు. కానీ ఆయనకి క్రికెట్‌లో కపిల్ దేవ్‌కి వచ్చినంత గుర్తింపు రేసింగ్‌లో రాలేదు.ఈ రేసింగ్ స్పోర్ట్ మనకి ఎప్పటినుంచో ఉంది, కాకపోతే ఇందులో కొంచెం రిస్క్ ఎక్కువ. కపిల్ దేవ్‌కి ఉన్నంత గుర్తింపు శ్యామ్ కొఠారికి కూడా రావాలనేదే నా మోటివ్. ఇది ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ రేసింగ్ విషయంలో కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్‌ను ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నాం.
-రాజశేఖర్ గారు కోచ్ అలాగే ఫాదర్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఆయన క్యారెక్టర్ రెగ్యులర్ ఫాదర్‌లా ఉండదు. ఆయన చుట్టూ ఒక కథ తిరుగుతుంది. ఆయన ఆ క్యారెక్టర్ చేయడంతో ఎమోషన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది.
ఎఫ్ వన్ చూసిన ఆడియన్స్‌కి ఈ సినిమా ఎలాంటి కొత్తదనం ఇస్తుంది?
ఎఫ్ వన్ సినిమా రిలీజ్ అయినప్పటికీ నా సినిమా పూర్తి అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ఎమోషన్, డ్రామా పరంగా రెండు కూడా చాలా డిఫరెంట్ సినిమాలు.
ఇలాంటి సినిమాలు తీయాలంటే నిర్మాతల సపోర్ట్ చాలా ఉండాలి కదా?
యూవీ క్రియేషన్స్‌లో చేసిన ప్రతి సినిమా విజువల్‌గా, టెక్నికల్‌గా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. కథ నచ్చితే ఆ కథ కోసం ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేస్తారు.
ఇండోనేషియాలో ఈ సినిమా క్లైమాక్స్‌ను షూట్ చేశాం. అక్కడ రేసింగ్ షూట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ వాళ్లే అక్కడ వద్దనుకున్నారు. అలాంటి లోకేషన్‌లో మేము సెట్ వేసి మరీ చేశాం. ఎందుకంటే ఈ కథకి అలాంటి ప్రాంతం కావాలి.
శర్వానంద్ గారు ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా సర్ప్రైజ్‌గా ఉంది కదా. ఈ క్యారెక్టర్ విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఈ సినిమా కోసం ఆయన దాదాపుగా 23 కేజీలు తగ్గారు. కథ చెప్పినప్పుడే బైకర్ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని మేము ఫిక్స్ అయ్యాము. ఆయన ఈ సినిమా కోసం దాదాపు 6 నెలలు బ్రేక్ తీసుకుని ఫిజికల్‌గా, మెంటల్‌గా ప్రిపేర్ అయ్యారు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్‌గా ఉంటుంది. శర్వా గారు ఈ సినిమాను తన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పారు. సినిమాపై ఆయనకున్న నమ్మకంతోనే ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం అని చెప్పారు.
ఈ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు అందరిలో ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. శర్వానంద్ గారు, రాజశేఖర్ గారు, నిర్మాతలు అందరి నమ్మకం వల్లే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది.
బైకర్‌లో మీరు అచీవ్ చేసిన ఎలిమెంట్ ఏమిటి?
ఈ స్పోర్ట్‌ను షూట్ చేయడమే చాలా టఫ్. ఆ స్పోర్ట్ ని స్క్రీన్‌పైకి తీసుకురావడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఈ సినిమాలో చాలా మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది.
-మాళవిక ఈ సినిమాలో చాలా కీలక పాత్ర పోషించింది. సినిమా చూసిన తర్వాత ఆ పాత్రకి మాళవిక గారినే ఎందుకు తీసుకున్నామో ఆడియన్స్‌కి అర్థమవుతుంది.
-రాజశేఖర్ గారు, శర్వా గారు, మాళవిక గారు అందరూ కూడా సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథను యాక్సెప్ట్ చేశారు. నిర్మాతలు ఫస్ట్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరం సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
ట్రైలర్ చూశాక ప్రభాస్ గారి రియాక్షన్ ఏమిటి?
ప్రభాస్ గారు వంశీ గారితో ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పారు. ఆయన మా సినిమా కోసం ట్వీట్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.
జిబ్రాన్ మ్యూజిక్ గురించి?
జిబ్రాన్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. చివరి 40 నిమిషాలు ఇందులో అవుట్‌స్టాండింగ్ మ్యూజిక్ ఉంటుంది. ఆడియన్స్ చాలా కొత్త సౌండ్‌ను ఎక్స్‌పీరియన్స్ చేస్తారు.
మా నాన్న సూపర్ హీరో, ఇప్పుడు బైకర్‌లో కూడా ఫాదర్ ఎమోషన్ కామన్‌గా ఉంది. ఇందులో మీ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా?
నాకు మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అంటే ఇష్టం. నేను ఏం చేసినా కూడా ఆ మిడిల్ క్లాస్ ఎమోషన్లే షూట్ చేయగలను.
దిల్ రాజు గారు ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఏం చెప్పారు?
దిల్ రాజు గారికి ఈ సినిమా చాలా నచ్చింది. చాలా చక్కగా తీశానని చెప్పారు. నా నెక్స్ట్ సినిమా కూడా ఆయనతోనే చేస్తున్నాను.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?