NTV Telugu Site icon

Biggboss 7 Telugu: బ్రేకింగ్.. హౌస్ కు గుడ్ బై చెప్పిన శివాజీ.. ?

Shivaji

Shivaji

Biggboss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 12 వారాలు పూర్తికాగా.. ఇంకో మూడు వారాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇక కెప్టెన్సీ టాస్క్ లు లేవు. అందరు గేమ్ మీదనే ఫోకస్ పెట్టాలి. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ ను బిగ్ బాస్ రద్దు చేయడంతో అమర్ కెప్టెన్ గా ఉండకుండానే సీజన్ ముగుస్తుంది. ఇక వారంలో చేసిన తప్పులను నాగార్జున శనివారం ఏకరువు పెట్టాడు.ఒక్కొక్కరిగా ఎవరికి ఇవ్వాల్సిన కోటా వాళ్ళకి ఇచ్చేశాడు. అందుకు సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మొదటి నుంచి ఇంట్లో శివాజీ.. వెళ్ళిపోతా ఉండలేను.. నచ్చడం లేదు. హౌస్ లో వాళ్ల నటన చూడలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చేవాడు. ఆ తరువాత హ్యాండ్ పెయిన్ అని కొన్నిరోజులు బయటకి వెళ్ళిపోతా అని చెప్పాడు. ఇక ఎప్పటిక్కప్పుడు బిగ్ బాస్.. నాగ్, శివాజీకి నచ్చజెప్పి ఇంట్లో ఉంచుతూ వచ్చారు.

Sriram: సక్సెస్ తలకెక్కని హీరో అల్లు అర్జున్.. నాకు ఇగో ఎక్కువ.. అందుకే

ఇక మరోసారి శివాజీ.. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతా అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. తాజా ప్రోమోలో శివాజీ.. కెమెరాల ముందుకు వచ్చి కన్ఫెషన్ రూమ్ లోకి పిలవమని రిక్వెస్ట్ చేస్తాడు. బిగ్ బాస్ పిలవడంతో కన్ఫెషన్ రూమ్ కు వెళ్లిన శివాజీ.. తాను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని, వెళ్ళిపోతాను అని చెప్పడంతో బిగ్ బాస్.. ఇంకా మూడు వారాలు మాత్రమే టైమ్ ఉందని.. ఒక మంచి డెసిషన్ తీసుకోవాల్సిందిగా సూచించగా.. వెంటనే శివాజీ.. బిగ్ బాస్ కు గుడ్ బై చెప్తాడు. ఇది ప్రోమో లో ఉంది. అయితే.. ఇదంతా శుక్రవారం జరిగినట్లు తెలుస్తోంది. శనివారం.. నాగ్ తో మాట్లాడుతున్న ప్రోమోలు వచ్చాయి. బిగ్ బాస్.. శివాజీని మరోసారి ఒప్పించి ఇంట్లో ఉంచినట్లు తెలుస్తోంది. అసలు శివాజీ ఎందుకు గుడ్ బై చెప్పాడో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.