స్టార్ మా ఛానెల్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈమధ్యనే జరిగిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన ఈ సీజన్ చివరి అంకంలో అనూహ్యమైన రేటింగ్స్‌ను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మేరకు అందుతున్న సమాచారం మేరకు తెలుగు టెలివిజన్ చరిత్రలో గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా, సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఏకంగా 19.6 TVR రేటింగ్‌ను నమోదు చేసింది. ఈ భారీ విజయం ‘బిగ్ బాస్’ క్రేజ్ తెలుగు ప్రేక్షకుల్లో ఇసుమంతైనా తగ్గలేదని మరోసారి నిరూపించిందని అంటున్నారు.
Also Read: Naa Anveshana : ముగిసిన స్నేహం.. మొదలైన యుద్ధం.! అన్వేష్ కాంట్రవర్సీలో ‘ఏయ్ జూడ్’ సంచలన వీడియో
ఇక ఈ సీజన్‌కు భారీగా స్పాన్సర్లు లభించడం గమనార్హం. మారుతి సుజుకి ప్రెజెంటింగ్ స్పాన్సర్‌గా ఉండగా, ఏషియన్ పెయింట్స్, సర్ఫ్ ఎక్సెల్, రాఫ్, సత్య ప్రొడక్ట్స్ వంటి ప్రముఖ సంస్థలు కో-ప్రెజెంటింగ్ పార్ట్నర్లుగా వ్యవహరించాయి. మొత్తానికి, సీజన్ 9 ముగింపు వేడుక టెలివిజన్ రేటింగ్స్ పరంగా “అన్ డిస్ప్యూటెడ్ కింగ్” అనిపించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈ రేటింగ్స్ గురించి నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
